Abdul Razzaq | ఫైనల్లో భారత్ ఓడిపోవడం మంచిదే.. మరోసారి టీమిండియాపై రజాక్ అక్కసు
Abdul Razzaq : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్(Abdul Razzaq) మరోసారి భారత జట్టు(Team India)పై అక్కసు వెళ్లగక్కాడు. ఈమధ్యే బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్(Aishwarya Rai)పై వివాదస్పద వ్యాఖ్యలతో విమర్శల పాలైన రజాక్.. వరల్డ్ కప్ ఫైనల్లో(ODI World Cup 2023) భారత జట్టు ఓడిపోవడం క్రికెట్‌కు...
Abdul Razzaq : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్(Abdul Razzaq) మరోసారి భారత జట్టు(Team India)పై అక్కసు వెళ్లగక్కాడు. ఈమధ్యే బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్(Aishwarya Rai)పై వివాదస్పద వ్యాఖ్యలతో విమర్శల పాలైన రజాక్.. వరల్డ్ కప్ ఫైనల్లో(ODI World Cup 2023) భారత జట్టు ఓడిపోవడం క్రికెట్‌కు మంచిదే అని అన్నాడు. పాక్‌కు చెందిన ‘హస్నా మనా హై'(Hasna Mana Hai) టీవీ షోలో రజాక్ మాట్లాడుతూ అడడు మరోసారి భారత్‌పై విషం కక్కాడు.
‘భారత్ ఓడిపోవడం క్రికెట్‌కు చాలా మంచిది. భారత ఆటగాళ్లు అతి విశ్వాసంతో ఉన్నారు. క్రికెట్ గెలిచింది. భారత్ ఓడింది. ఒకవేళ భారత్ గెలిచి ఉంటే అది క్రికెట్లో బాధాకరమైన క్షణం అయ్యేది. ఎందుకంటే.. భారత్ స్వదేశంలోని పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంది. పైగా ఫైనల్ మ్యాచ్‌కు అలాంటి చెత్త పిచ్‌ను వాడడం నేను ఇంతకుముందు చూడలేదు. ఫైనల్లో 240 పరుగులు చేశారు. పిచ్‌లు రెండు జట్లకు అనుకూలంగా ఉండాలి. ఒకవేళ ఫైనల్లో కోహ్లీ సెంచరీ కొడితే టీమిండియా వరల్డ్ కప్ గెలిచేది’ అని రజాక్ వెల్లడించాడు.

రజాక్ వ్యాఖ్యలపై భారత ఫ్యాన్స్ మండిపతున్నారు. పక్కవాళ్ల ఓటమికి సంతోషించే అల్పజీవులు మీరు అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. వరల్డ్ కప్‌లో బాబర్ ఆజాం నేతృత్వలోని పాక్ జట్టు భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. వరుస పరాజయాలతో దాయది జట్టు సెమీస్ ముంగిట బొక్కాబోర్లా పడింది. ఇక.. లీగ్ దశలో ఓటమన్నదే ఎరుగని భారత్.. సెమీస్‌లోనూ కివీస్‌ను 70 పరుగులతో మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే.. ఫైనల్లో స్లో పిచ్ కారణంగా భారత్ 240కే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో ట్రావిస్ హెడ్(137), మార్నస్ లబూషేన్(58) పట్టుదలగా ఆడి ఆస్ట్రేలియాను గెలిపించారు. దాంతో, సొంత గడ్డపై రెండోసారి కప్పు అందుకోవాలనుకున్న భారత జట్టు ఆశలు అడియాసలయ్యాయి.
ఇవి కూడా చదవండి
-
Snake | గదిలోకి పామును వదిలి.. భార్య, రెండేళ్ల కుమార్తెను చంపిన వ్యక్తి
-
Sandeep Reddy Vanga | ప్రభాస్ అన్నతో నెక్ట్స్ సినిమా.. యానిమల్ ప్రమోషన్స్‌లో రణ్‌బీర్‌కపూర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

