బెంగళూరు: ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియాకు శుభవార్త. గాయం కారణంగా చాన్నాళ్లుగా మైదానానికి దూరమైన వికెట్ కీపర్, బ్యాటర్ లోకేశ్ రాహుల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న రాహుల్..
బ్యాటింగ్‌తో పాటు కీపింగ్ కూడా ప్రారంభించినట్లు ఎన్సీఏ వర్గాలు తెలిపాయి. ఆసియా కప్ కోసం ఈ నెల 21న జట్టును ఎంపిక చేయనుండగా.. అప్పటి వరకు రాహుల్ మరింత మెరుగవడం ఖాయంగా కనిపిస్తున్నది. మరోవైపు ఎన్సీఏలోనే సాధన చేస్తున్న శ్రేయస్ అయ్యర్.. జట్టులోకి వచ్చేందుకు ఇంకాస్త సమయం పట్టే అవకాశాలున్నాయి.