Aditi Chauhan : భారత ఫుట్‌బాల్‌లో ఒక అధ్యాయానికి తెరపడింది. తొలి మహిళా గోల్ కీపర్‌గా చరిత్ర సృష్టించిన అదితీ చౌహన్ (Aditi Chauhan) తనకెంటో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలికింది. పదేళ్లుగా గోల్ కీపర్‌గా జట్టుకు అమూల్యమైన సేవలందించిన అదితి గురువారం తన కెరీర్‌ను ముగించింది. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు.. ఎన్నో చిరస్మరణీయ విజయాలను చవిచూసిన ఆమె సగర్వంగా ఫుట్‌బాల్‌కు అల్విదా చెప్పేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
థ్యాంక్యూ ఫుట్‌బాల్. నన్ను ఈ స్థాయికి చేర్చినందుకు.. నాకు ఎన్నో పరీక్షలు పెట్టినందుకు, నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చినందుకు. మరుపంటూ రాని 17 ఏళ్ల ప్రయాణాన్ని ముగిస్తున్నాను అని మాజీ గోల్ కీపర్ ఎక్స్‌లో భావోద్వేగంతో పోస్ట్ పెట్టింది. ఫుట్‌బాల్ నాకు కెరీర్ మాత్రమే కాదు ఇంకా చాలా ఇచ్చింది. నాకు తొలి మహిళా గోల్ కీపర్ అనే గుర్తింపును తెచ్చింది. ఢిల్లీ నుంచి నా కలల్ని సాకారం చేసుకుంటూ.. లండన్ వరకూ వెళ్లాను. అక్కడే నేను స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశాను. అదే సమయంలో వెస్ట్ హమ్ యునైటె డ్ జట్టు తరఫున ఆడాను.
Aditi Chauhan, the trailblazing Indian goalkeeper and the first Indian woman to play in the Women’s Super League (West Ham United, 2015), announces her retirement after a remarkable 17-year career. ⚽️
Thank you, Aditi, for breaking barriers and inspiring countless young… pic.twitter.com/R7ScXjL8eN
— Doordarshan Sports (@ddsportschannel) July 17, 2025
చదువు, ఫుట్‌బాల్.. రెండిటిలో ఏది ముఖ్యమో తేల్చుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే.. నా దృష్టిలో రెండూ ముఖ్యమే. అందుకే.. రెండిటినీ బ్యాలెన్స్ చేసేందుకు ఎంతో కష్టపడ్డాను. రెండు పర్యాయాలు మోకాలి లిగమెంట్స్ గాయంతో బాధపడ్డాను. అయినా ఆటపై ఉన్న ఇష్టంతో త్వరగా కోలుకున్నాక మైదానంలో అడుగుపెట్టాను. ఇతరులకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతోనే గుండె నిబ్బరంతో గాయాల్ని అధిగమిస్తూ గోల్ కీపింగ్ చేశాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో కుటుంబం, కోచ్, సహచరులు అందించిన సహకారం మరువలేనిది అని అదితి వెల్లడించింది.
అదితి స్వరాష్ట్రం తమిళనాడు. కానీ, కొన్నాళ్లకు వాళ్ల కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్ మీద ఇష్టం పెంచుకున్న ఆమె.. పెద్దయ్యాక గోల్ కీపర్ అయింది. భారత తొలి మహిళా గోల్ కీపర్‌గా రికార్డు నెలకొల్పిన అదితి.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది అదితి. 2012, 2016, 2019లో సీనియర్ టీమ్ ఎస్ఏఎఫ్ఎఫ్ ఛాంపియన్షిప్ గెలుపొందడంలో ఆమె కృషి ఎనలేనిది. గోకులం కేరళ ఎఫ్‌సీ తరఫున ఇండియన్ ఉమెన్స్ లీగ్ టైటిల్ సాధించింది అదితి.