ఊర్కొండ, ఫిబ్రవరి 14 : మరో మూడు గంటలు ప్రయాణిస్తే శ్రీశైల మల్లన్న సన్నిధి చేరుకుంటామనేలోపే మృత్యు దేవత కల్వర్టు రూపంలో కబళించింది. మరణంలో కూడా విడిపోని భార్యాభర్తలతో పాటు మరోప్రాణం గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం విజయపురి జిల్లా తల్లికోట ప్రాంతానికి చెందిన రాంరెడ్డి తన కుటుంబసభ్యులతో రెండు క్రూజర్ వాహనాల్లో శ్రీశైలానికి బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో వారి వాహనం నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామ శివారులో కల్వర్టుకు ఢీకొట్టింది. దీంతో వాహనంలోని ము గ్గురి ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి.
రాంరెడ్డి (52), ఆయన భార్య మేఘన రెడ్డి (45), మహాదేవి (55) మృతిచెందగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. వా హనం ముందుభాగం తీవ్రంగా ధ్వంసం కావడంతో ముం దుభాగంలో కూర్చున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. భా ర్యాభర్తలు ఇరువురు ఒకేసారి మృతిచెందారన్న వార్త స్థా నికులను కలచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘ టనా స్థలానికి వెళ్లి లారీ డ్రైవర్ సాయంతో మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో వెల్డండ మండలంలోని యెన్నం ప్రైవే ట్ దవాఖానకు కు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై కృష్ణదేవ మాట్లాడుతూ డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా నడపడమే దీనికి కారణమన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుందని ఆయన పేర్కొన్నారు. వాహన డ్రైవర్లు దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు నిద్ర వస్తే కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఆయన సూచించారు.