మాలేగావ్‌లో టిప్పు సుల్తాన్ ఫొటో వివాదం
మాలేగావ్ నగర మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్తగా ఎన్నికైన డిప్యూటీ మేయర్ కార్యాలయంలో పెట్టిన టిప్పు సుల్తాన్ ఫొటో వివాదాన్ని రాజేసింది.
- బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం
ముంబై, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): మాలేగావ్ నగర మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్తగా ఎన్నికైన డిప్యూటీ మేయర్ కార్యాలయంలో పెట్టిన టిప్పు సుల్తాన్ ఫొటో వివాదాన్ని రాజేసింది. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో పాటు హిందుత్వ సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గత శనివారం నర్సీన్ బానో మేయర్‌గా, షా న్-ఎ-హింద్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. బుధవారం బాధ్యత లు చేపట్టాక షాన్ టిప్పు సుల్తాన్ చిత్రాన్ని డిప్యూటీ మేయర్ తన కార్యాలయంలో అమర్చారు. శుక్రవారం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ కావడంతో నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
సంఘటనపై షిండే శివసేన, హిందుత్వ సంస్థలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక జాబితాలోని గొప్ప వ్యక్తుల ఫొటోలను మాత్ర మే ప్రదర్శించాలనే నియమం ఉందని పేరొంటూ మున్సిపల్ కమిషనర్ రవీంద్ర జాదవ్‌కు వినతి పత్రం సమర్పించాయి. కాగా, ఛత్రపతి శివాజీ మహరాజ్ లాగానే టిప్పు సుల్తాన్ కూడా గొప్ప వాడని, ఆయనను కూడా గౌరవించాలని కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ సపాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందిస్తూ టిప్పు సుల్తాన్ లాంటి హంతకుడిని ఛత్రపతి శివాజీ మహరాజ్‌తో పోల్చడం సిగ్గుచేటని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

