వెండితెర వేల్పు!
తెలుగు నటులు ఎన్నో పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. శ్రీమద్భాగవత-భారత-రామాయణ ఇతివృత్తాలుగా.. వెండితెరపై దైవత్వాన్ని సాక్షాత్కరింపజేశారు. తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. అయితే, తెరపై పరమశివుడిగా కనిపించి, ఆ గంభీరమైన రూపానికి, ఆహార్యానికి ప్రాణం పోసిన నటులు కొందరే ఉన్నారు.
తెలుగు నటులు ఎన్నో పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. శ్రీమద్భాగవత-భారత-రామాయణ ఇతివృత్తాలుగా.. వెండితెరపై దైవత్వాన్ని సాక్షాత్కరింపజేశారు. తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. అయితే, తెరపై పరమశివుడిగా కనిపించి, ఆ గంభీరమైన రూపానికి, ఆహార్యానికి ప్రాణం పోసిన నటులు కొందరే ఉన్నారు. ‘శివుడి’గా మెప్పించి.. బాక్సాఫీస్ హుండీలో కానుకలు పడేలా చేసిన నటుల జాబితా ఇది..
ఎన్టీయార్: తెరపై రాముడు, కృష్ణుడు అంటే.. ఎన్టీయార్ మాత్రమే అనేలా అద్భుతమైన పాత్రలు పోషించారు నందమూరి తారక రామారావు. దక్షయజ్ఞం, ఉమాచండీ గౌరీశంకరుల కథ చిత్రాల్లో పరమ శివుడిగానూ గంభీరంగా కనిపించారు. సాక్షాత్తు ఆ పరమశివుడే దిగివచ్చాడా?! అన్నట్లుగా తెరపై శివ తాండవం చేశారు. ‘దక్షయజ్ఞం’లో శివుడిగా ఆయన చూపిన రౌద్రం.. అజరామరంగా నిలిచిపోయింది. అయితే, ఈ సినిమాలో శివుడి పాత్రను పోషిస్తున్న సమయంలోనే ఎన్టీయార్ పెద్ద కొడుకు రామకృష్ణ అనారోగ్యంతో మరణించాడు. దాన్ని సెంటిమెంట్‌గా తీసుకున్న రామారావు.. అప్పటినుంచి సినిమాల్లో శివుడి పాత్రను పోషించలేదు. లేకుంటే.. మరిన్ని సినిమాల్లో పరమేశ్వరుడిగా కనిపించి, మనల్ని అలరించేవారే!
చిరంజీవి : మెగాస్టార్ అంటేనే.. ఒక స్టయిల్! ఒక గ్రేస్! ఆయన వేసే స్టెప్పులు, చేసే ఫైట్స్.. వేరే లెవెల్ అనేలా ఉంటాయి. అలాంటి మెగాస్టార్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ‘శ్రీ మంజునాథ’ సినిమా కోసం శివుడి పాత్రను ధరించారు. శివుడిగా తన ఆహార్యం, కళ్లలోని ప్రశాంతతతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన చేసిన ఆనంద తాండవం.. సినిమాకే హైలైట్! కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆపద్బాంధవుడు’ సినిమాలోనూ చిరంజీవి శివుడిగా కనిపించాడు. స్టేజీ మీద శివుడి పాత్రలో లీనమై అలరించారు.
శోభన్ బాబు : సోగ్గాడుగా పేరొందిన శోభన్ బాబు.. ‘పరమానందయ్య శిష్యుల కథ’లో శివుడి పాత్రలో నటించి మెప్పించారు. తన ప్రసన్న వదనం, మందహాసంతో శివుడి పాత్రకు ప్రత్యేక ఆకర్శణ తీసుకొచ్చారు.
కృష్ణంరాజు: గంభీరమైన కంఠస్వరం, భారీ విగ్రహం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంతం. భక్త కన్నప్పగానే కాదు..
‘శ్రీ వినాయక విజయం’ సినిమాలో పరమేశ్వరుడిగానూ కనిపించారు. తనదైన నటనతో శివుడిలోని శాంతం-రౌద్రం రెండిటినీ సమపాళ్లలో పలికించారు.
నాగభూషణం: విలక్షణమైన విలనిజం, కామెడీ టైమింగ్‌తో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు నాగభూషణం. కెరీర్ ఆరంభంలో పలు పౌరాణిక చిత్రాలలోనూ నటించారు. అజరామరమైన భక్తిరస చిత్రంగా నిలిచిపోయే భూకైలాస్‌లో.. పరమశివుడిగా కనిపించారు. తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు.
రావుగోపాలరావు: సహజసిద్ధమైన గాంభీర్యంతో ఎన్నో విలన్పాత్రలు పోషించారు రావుగోపాలరావు. ఆ గాంభీర్యమే ‘మా ఊళ్లో మహాశివుడు’లో ఆయనకు శివుడి పాత్రను తెచ్చిపెట్టింది. తనదైన శైలిలో ఆయన పలికే గంభీరమైన డైలాగులు.. ఆ పాత్రకు ప్రాణం పోశాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

