IPL 2025 : ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్యంసక ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. అతడు క్రీజులో ఉన్నాడంటే బౌలర్లకు వణుకే. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు చేసిన ఈ ఆసీస్ బ్యాటర్ ఐపీఎల్లో మాత్రం చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. 18వ ఎడిషన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న మ్యాక్సీ.. 18వ సీజన్ తొలి మ్యాచ్‌లో సున్నాకే వెనుదిరిగాడు. అది కూడా ఎదుర్కొన్న మొదటి బంతికే ఎల్బీగా ఔటయ్యాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు గోల్డెన్ డక్ అయిన బ్యాటర్‌గా నిలిచాడీ ఆల్‌రౌండర్.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ గోల్డెన్ డకట్ అయ్యాడు. సాయికిశోర్ బౌలింగ్‌లో అజ్మతుల్లా ఓమర్జాయ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మ్యాక్సీ.. తొలి బంతికే ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దాంతో, ఐపీఎల్లో 19సార్లు మొదటి బంతికే సున్నా చుట్టేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
Twin Strikes, ft. Sai Kishore ☝️☝️
The #GT spinner thrills the home crowd with back-to-back wickets 👏
Updates ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @gujarat_titans pic.twitter.com/fEdBTy3McZ
— IndianPremierLeague (@IPL) March 25, 2025
ఐపీఎల్లో అత్యధిక పర్యాయాలు గోల్డెన్ డక్ అయిన టాప్ -3 బ్యాటర్లు ఎవరంటే.. ? ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోచ్ దినేశ్ కార్తిక్‌లు సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. 16సార్లు ఈ విధంగా ఔటైన పీయూష్ చావ్లా, సునీల్ నరైన్‌లు మూడో స్థానంలో నిలిచారు