Amarchinta | అమరచింత, మార్చి 25 : గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురు వ్యక్తులని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆత్మకూర్ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచామని.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. దొంగతనం కేసు వివరాలను మంగళవారం సీఐ శివకుమార్, ఎస్ఐ సురేష్ మంగళవారం మీడియాకు వివరించారు. మండలంలోని చింత రెడ్డి పల్లి గ్రామంలో ఈ నెల 22న అపరహరణకు గురైన గొర్రెల దొంగల కేసులో నారాయణపేట జిల్లా నర్వ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కురువ నాగరాజు తనకున్న గొర్రెలను మేపుకునేందుకు అమరచింద మండలం చింతరెడ్డిపల్లి శివారులోని వ్యవసాయ పొలాల వద్దకు 20 రోజుల కిందట వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 22న ఎప్పటిలాగే గొర్రెలను మేపుకొని వ్యవసాయ పొలాల్లో మంద ఏర్పాటు చేశాడు. తెల్లవారి చూసే సరికి 13 గొర్రెలు మాయమ్యాయి.
దాంతో యజమాని కురవ నాగరాజు అమరచింత పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది పురుషోత్తం నాగరాజు రామకృష్ణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మద్యానికి బానిసైన చింతరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి మిఠానందిమల్ల గ్రామానికి చెందిన కురువ మల్లేష్, నందిమల్ల గ్రామానికి చెందిన భీమన్నతో కలిసి గొర్రెలను దొంగిలించారు. ఆటోలో గొర్రెలను నారాయణపేట జిల్లా కోస్గి సంతలో విక్రయించినట్లుగా గుర్తించారు. రూ.90వేలు రావడంతో ముగ్గురు పంచుకున్నట్లుగా విచారణలో తేలింది. నిందితులు ముగ్గురు సురేష్, మల్లేశ్, భీమన్నను మంగళవారం అరెస్టు చేసి ఆత్మకూరు కోర్టులో హాజరు పరిచారు. దాంతో న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దాంతో వారిని రిమాండ్కు తరలించినట్లు సీఐ శివకుమార్, ఎస్ఐ సురేష్ తెలిపారు. యువత మద్యానికి బానిసలై చెడు అలవాట్లకు పాల్పడుతున్నారని, మద్యం మత్తులో దొంగతనాలతో పాటు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. పెడదారిన పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.