Glenn Maxwell : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) ఎప్పుడు ఎలా ఆడుతాడో తెలియదు. క్రీజులో కుదురుకున్నాడంటే మాత్రం భారీ షాట్లతో విరుచుకుపడుతాడు. స్పిన్నర్లను ముప్పతిప్పలు పెడుతూ రివర్స్ స్వీప్, స్వీప్ షాట్లతో బౌండరీల మోత మోగిస్తాడు. ఈమధ్య పెద్దగా రాణించని మ్యాక్స్‌వెల్ టీ20 మ్యాచ్‌లో తన స్టయిల్లో రెచ్చిపోయాడు.
పాకిస్థాన్ పేస్ బౌలర్లను ఊచకోత కోస్తూ స్కోర్ బోర్డును ఉరికించాడు. ముఖ్యంగా పాక్ ప్రధాన పేసర్ షాహీన్ ఆఫ్రిదిని లక్ష్యంగా చేసుకొని మ్యాక్సీ ఓ రేంజ్లో చెలరేగాడు. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మ్యాక్సీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఉన్నంత సేపు పాక్ బౌలర్లను వణికించాడు. యువ పేసర్ నసీం షా వేసిన రెండో ఓవర్లో ఆసీస్ చిచ్చరపిడిగు 4, 0, 4, 4, 4 బాదాడు.
Maxwell SWITCH HITTING Naseem on every single ball 🫢 pic.twitter.com/XBK2upGrfl
— Rishab Jain (@Thecrickanalyst) November 14, 2024
ఆ తర్వాత హ్యారిస్ రవుఫ్కు చుక్కలు చూపిస్తూ ఒక ఫోర్, 2 సిక్సర్లు బాదాడు. ఇక.. షాహీన్ ఆఫ్రిదికి కూడా ఆసీస్ ఆల్‌రౌండర్ దడ పుట్టించాడు. అతడు వేసిన 4 వ ఓవర్లో రివర్స్ స్వీప్ ద్వారా బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు మ్యాక్సీ. ఆ షాట్ చూసిన ఆఫ్రిది ఇదేం విధ్వంసం రా బాబు అని తల పట్టుకున్నాడు. ప్రస్తుతం మ్యాక్సీ సుడిగాలి ఇన్నింగ్స్ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. స్వదేశంలో పాకిస్థాన్‌కు పెద్దగా పోటీ ఇవ్వలేక వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్ పట్టేయాలనే పట్టుదలతో ఉంది.