IND vs ENG : టెస్టు సారథిగా తొలి సిరీస్‌లోనే చెరిగిపోని ముద్ర వేస్తున్నాడు శుభ్‌మన్ గిల్ (Shubman Gill). క్రీడా దిగ్గజాలను ఆశ్చర్యపరుస్తూ.. అభిమానులను ఆనందంలో ముంచెత్తుతూ టీమిండియా కెప్టెన్‌గా కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాడీ యువకెరటం. లీడ్స్‌లో శతకంతో సారథిగా తాను నూరుపాళ్లు న్యాయం చేస్తానని చాటిన అతడు.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులోనూ విధ్వంస రచన కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకంతో చెలరేగిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో కదం తొక్కాడు.
లంచ్‌కు ముందు క్రీజులోకి వచ్చిన గిల్.. క్లాస్ బ్యాటింగ్‌తో జట్టు ఆధిక్యాన్ని పెంచుతూనే వ్యక్తిగత మైలురాయికి చేరువయ్యాడు. బషీర్ ఓవర్లో సింగిల్ తీసి మూడంకెల స్కోర్‌కు చేరువయ్యాడు. దాంతో, ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ బాదిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) 1971లో మొదట ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా ఆటగాడిగా ఈ ఘనత సొంతం చేసుకున్న తొమ్మిదో ఆటగాడిగా ప్రిన్స్ నయా చరిత్ర లిఖించాడు.
India players with a double-hundred and hundred in the same Test:
Sunil Gavaskar vs WI, Trinidad 1971
𝗦𝗵𝘂𝗯𝗺𝗮𝗻 𝗚𝗶𝗹𝗹 𝘃𝘀 𝗘𝗡𝗚, 𝗕𝗶𝗿𝗺𝗶𝗻𝗴𝗵𝗮𝗺 𝟮𝟬𝟮𝟱End of list. pic.twitter.com/aTiDepUpsl
— ESPNcricinfo (@ESPNcricinfo) July 5, 2025
రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీతో విరుచుకుపడగా భారత జట్టు మ్యాచ్‌పై పట్టుబిగించింది. లంచ్ తర్వాత రిషభ్ పంత్(61)తో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన గిల్.. అనంతరం రవీంద్ర జడేజా(25)తో 68 రన్స్ జోడించాడు. దాంతో, టీ సెషన్‌కు భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 304 రన్స్ చేసింది. 484 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. దాంతో, టీ సెషన్‌కు భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 304 రన్స్ చేసింది. 484 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.