Shubman Gill : భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తొలి సిరీస్‌లోనే రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. బర్మింగ్హమ్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో కదం తొక్కి సంచలనం సృష్టించిన గిల్.. మరో రికార్డు నెలకొల్పాడు. మాంచెస్టర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జట్టును గట్టెక్కించే ఇన్నింగ్స్ ఆడుతున్న సారథి.. 700 రన్స్‌తో చరిత్రకెక్కాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక రన్స్ కొట్టిన మొట్ట మొదటి భారత కెప్టెన్‌గా గిల్ అవతరించాడు. ఆటగాడిగా చూస్తే.. ఈ ఘనత సాధించినా నాలుగో ఇండియన్‌గా రికార్డు తన పేరిట రాసుకున్నాడీ యువ నాయకుడు.
మాంచెస్టర్ టెస్టులో పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ఆదుకునే పనిలో పడిన గిల్ అర్ధ శతకంతో రాణించాడు. ఈ సిరీస్‌లో 700 పరుగులకు చేరువైన అతడు.. లెజెండ్ సునీల్ గవాస్కర్ రికార్డు బద్ధలు కొట్టాడు. ఇక కెప్టెన్‌గా ఏడొందలకు పైగా రన్స్ చేసిన దిగ్గజాల సరసన నిలిచాడు గిల్. అతడి కంటే ముందు డాన్ బ్రాడ్‌మన్ గ్యారీఫీల్డ్ సోబర్స్, గ్రెగ్ ఛాపెల్, డేవిడ్ గోవర్, గ్రాహమ్ గూచ్, గ్రేమ్ స్మిత్‌లు ఈ మైలురాయిని సాధించారు.
India players with 700+ runs in a Test series:
Sunil Gavaksar vs WI, 1971
Sunil Gavaskar vs WI, 1978-79
Yashasvi Jaiswal vs ENG, 2024
𝗦𝗵𝘂𝗯𝗺𝗮𝗻 𝗚𝗶𝗹𝗹 𝘃𝘀 𝗘𝗡𝗚, 𝟮𝟬𝟮𝟱 pic.twitter.com/ainuNBgyex— ESPNcricinfo (@ESPNcricinfo) July 27, 2025
ఒకే సిరీస్‌లో ఏడొందలు కొట్టిన భారత క్రికెటర్లు ఎవరంటే..?
సునీల్ గవాస్కర్ – వెస్టిండీస్‌పై 1971లో 774 పరుగులు.
సునీల్ గవాస్కర్ – వెస్టిండీస్‌పై 1978/79లో 732 పరుగులు.
యశస్వీ జైస్వాల్ – ఇంగ్లండ్‌పై 2024లో 712 రన్స్.
శుభ్‌మన్ గిల్ – ఇంగ్లండ్‌పై 2025 అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో..