కట్టంగూర్, జూలై 27 : దివంగత వందనపల్లి మాజీ సర్పంచ్ పగడాల వెంకమ్మ గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని సీపీఎం మండల పార్టీ కార్యదర్శి పెంజర్ల సైదులు, సీనియర్ నాయకులు లకపక రాజు అన్నారు. ఆదివారం మండలంలోని వందనపల్లి గ్రామంలో జరిగిన వెంకమ్మ దశదిన కార్యక్రమంలో భాగంగా ఆమె స్మారక స్తూపాన్ని ఆవిష్కరించి చిత్రచటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటునే స్వార్థం లేకుండా నిజాయితీగా గ్రామానికి రోడ్డు నిర్మాణంతో పాటు వ్యవసాయానికి సాగు, గ్రామస్తులకు తాగునీరు అందించాలరని కొనియాడారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మురా మోహన్, గుడుగుంట్ల రామకృష్ణ, గద్దపాటి యాదయ్య, గద్దపాటి ఇస్తాం, గద్దపాటి బాలనర్సింహ్మ. సోమయ్య, కుటుంబ సభ్యులు కృష్ణయ్య, గజ్జి లక్ష్మమ్మ, మేకల పద్మ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.