PM Modi : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తమిళనాడు (Tamil Nadu) పర్యటనలో భాగంగా గంగైకొండ చోళపురం ఆలయాన్ని (Gangaikonda Cholapuram Temple) సందర్శించారు. ఆదివారం రాజేంద్ర చోళుడి జయంతి సందర్భంగా ఈ పర్యటన జరగడం విశేషం. మాల్దీవుల పర్యటన ముగించుకున్న ఆయన శనివారం రాత్రి తమిళనాడులోని తూత్తుకూడికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు.
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివాలయాల్లో ఒకటి గంగైకొండ చోళపురం ఆలయం. ఆదివారం ఉదయం స్వామి దర్శనానికి సంప్రదాయ పంచెకట్టులో ప్రధాని మోదీ వచ్చారు. ఆలయ పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి మోదీ హారతి ఇచ్చారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆది తిరువతైరై ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు.
తమిళనాడు పర్యటన సందర్భంగా రూ.450 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తూత్తుకూడి విమానాశ్రయంలో విస్తరించిన కొత్త టెర్మినల్‌ను కూడా శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. రాష్ట్రంలో రూ.4,900 కోట్లతో పూర్తిచేసిన వివిధ రహదారులు, రైల్వే మార్గాలను ఆయన జాతికి అంకితం చేశారు.