India | పారిస్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో దుమ్మురేపిన భారత్ కీలక పోరులో తడబడింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పసిడి పోరుకు అర్హత సాధిస్తునుకున్న టీమ్ఇండియా సెమీఫైనల్ పోరులో నిరాశపరిచింది. మంగళవారం ఆఖరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన పోరులో భారత్ 2-3 తేడాతో జర్మనీ చేతిలో పోరాడి ఓడింది. మ్యాచ్ ఆద్యంతం ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది.
గత(టోక్యో) ఒలింపిక్స్‌లో తమకు ఎదురైన ఓటమికి పారిస్‌లో భారత్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు. మ్యాచ్ మొదలైన తొలి రెండు నిమిషాల్లోనే టీమ్ఇండియాకు రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్(7ని), సుఖ్జీత్సింగ్(36ని) గోల్స్ చేశారు. మరోవైపు గొంజాలో పిలియట్(18ని), క్రిస్టోఫర్ రర్(27ని), మార్కో మిల్టక్(54ని) జర్మనీకి గోల్స్ అందించారు.
మ్యాచ్ విషయానికొస్తే తొలి క్వార్టర్ ఏడో నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌సింగ్ అద్భుత రీతిలో గోల్‌గా మలువడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే రెండో క్వార్టర్ మొదట్లోనే పిలియట్..పెనాల్టీ కార్నర్ గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. మరో తొమ్మిది నిమిషాల తేడాతో క్రిస్టోఫర్ గోల్ చేయడంతోజర్మనీకి 2-1 ఆధిక్యం దక్కింది.
మ్యాచ్‌పై పట్టు కోల్పోతున్న సమయంలో సుఖ్జీత్సింగ్ గోల్‌తో భారత్ పోటీలోకి వచ్చింది. సమంగా సాగుతున్న మ్యాచ్ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా మార్కో ఫీల్డ్ గోల్‌తో జర్మనీ మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పుకుంది. ఆఖరి క్షణంలో భారత్‌కు గోల్ చేసే అవకాశం వచ్చినా..తృటిలో చేజారిపోయింది. గురువారం భారత్, స్పెయిన్ మధ్య కాంస్య పోరు జరుగనుండగా, పసిడి కోసం నెదర్లాండ్స్, జర్మనీ తలపడనున్నాయి.
2 జర్మనీతో సెమీస్ మ్యాచ్‌లో భారత్‌కు మొత్తం 12 పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కితే కేవలం రెండింటిని మాత్రమే గోల్స్‌గా మలిచింది. మరోవైపు జర్మనీ ఏడింటిలో ఒకటి గోల్ చేసింది.
8 సెమీస్ మ్యాచ్‌లో భారత్ 48 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకుంటే..52 శాతం జర్మనీ ఖాతాలో వేసుకుంది.