EURO 2024 : ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తికగా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక యూరో చాంపియన్‌షిప్(EURO 2024) మొదలైంది. జర్మనీ(Germany)లో సందడి వాతావరణం నడుమ సాకర్ పండుగ షురూ అయింది. ఈసారి 24 జట్లు టైటిల్ వేటకు సిద్ధమయ్యాయి. ఒక్కదాంట్లో నాలుగు చొప్పున ఈ జట్లను మొత్తం ఆరు (ఏబీసీడీఈఎఫ్) గ్రూప్‌లుగా విభజించారు. టోర్నీ తొలి పోరులో ఆతిథ్య జర్మనీ జయభేరి మోగించింది. స్కాంట్లాండ్ (Scotland)పై 5-1తో అద్భుత విజయం సాధించి మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది.
అనంతరం జరిగిన పోరులో స్విట్జర్లాండ్(Switzerland) బోణీ కొట్టింది. హంగేరీ జట్టుపై 3-1తో స్విస్ జట్టు సూపర్ విక్టరీ సాధించింది. ఇక గ్రూప్ ‘బి’ నుంచి స్పెయిన్(Spain), క్రొయేషియా(Croatia) జట్లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి.
Musiala & Wirtz shine as Germany open in style 🗞️👇#EURO2024
— UEFA EURO 2024 (@EURO2024) June 15, 2024
జర్మనీ వేదికగా యూరో చాంపియన్‌షిప్ నెల రోజుల పాటు జరుగనుంది. స్టార్ ఆటగాళ్ల స్టన్నింగ్ గోల్స్‌తో పాటు ఉత్కంఠ పోరాటాలు ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి. ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup) తర్వాత అతి పెద్దదైన ఈ మెగా టోర్నీని 10 స్టేడియాల్లో నిర్వహించనున్నారు. వాటిలో బెర్లిన్‌లోని ఒలింపియా స్టేడియం, మ్యూనిచ్‌లోని అలియంజ్ అరెనా(Allianz Arena) మైదానాలు ముఖ్యమైనవి. యూరో చాంపియన్‌షిప్‌లో ఇటలీ(Italy) డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టిం. 2020లో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఇటలీ ఫ పెనాల్టీలతో జయభేరి మోగించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.
Here we go! 🙌
Germany vs Scotland: Tap below for live updates! 📱#EURO2024 | #GERSCO
— UEFA EURO 2024 (@EURO2024) June 14, 2024