హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే జనాలతో హైదరాబాద్ నగరంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. జనం రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో సంక్రాంతి సందడి కనిపిస్తోంది. అటు జాతీయ రహదారులపై కూడా వాహనాల రద్దీ నెలకొన్నది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు బారులుతీరాయి.
సంక్రాంతి నేపథ్యంలో రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. సూర్యాపేటలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో హైవేపై ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు. వాహనాలు క్రమ పద్ధతిలో వెళ్లేలా చూస్తున్నారు. ఎక్కడైనా అవాంతరాలు ఏర్పడితే వెంటనే ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సిద్ధంగా ఉన్నారు.