BWF Championships: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అమ్మాయిలు పతకం ఖరారు చేశారు. మహిళల డబుల్స్‌లో సంచలన ఆటతో దూసుకెళ్తున్న గాయత్రి గోపిచంద్, త్రీసా జాలీ ద్వయం 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 16వ రౌండ్లో ఏడో సీడ్‌కు షాకిచ్చిన ఈ ద్యయం.. ఈసారి 32 వ రౌండ్లో నాలుగో సీడ్‌పై సంచలన విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా దేశానికి చరిత్రాత్మక పతకం అందించనుందీ జంట.
బ్యాడ్మింటన్ వరల్డ్‌కప్‌లో భారత అమ్మాయిలు చరిత్రాత్మక పతకం అందించారు. పీవీ సింధు విఫలమైనా మేమున్నాం అని చాటుతూ.. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీలు 15 ఏళ్ల కరువు తీర్చారు. 16వ రౌండ్లో ఏడో సీడ్‌ను ఇంటికి పంపిన ఈ జంట.. శుక్రవారం నాలుగో సీడ్ జియా యీ ఫాన్ – ఘాంగ్ షు గ్జియాన్(చైనా)ను చిత్తు చేసింది.
The winning point. 🏸
The overwhelming joy. 🥹🔊 Worth watching on loop, India fans! 🔁#SmashForIndia #NewDelhi2026 #BWFWorldChampionships pic.twitter.com/8MqVXvaj4s
— BAI Media (@BAI_Media) August 21, 2026
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 16-21తో కోల్పోయినా ఒత్తిడికి లోనవ్వని భారత ద్వయం రెండో సెట్‌ను 21-15తో గెలుచుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్లోనూ చైనా జోడీకి చెక్ పెడుతూ 21-13తో మ్యాచ్‌ను ముగించింది గాయత్రి, త్రిసా జంట. తద్వారా.. అశ్విని పొన్నప్ప, గుత్తా జ్వాల అనంతరం.. మహిళల డబుల్స్‌లో పతకం ఖాయం చేసిన రెండో జంటగా వీరు రికార్డు నెలకొల్పారు. 2011లో జ్వాల, అశ్వినిలు కాంస్యం సాధించారు.