Anupriya | హనుమాన్ అంశ్ (Hanuman Ansh) విజయం తరువాత నిర్మాత అనుప్రియా నాగర్ మీడియాతో ఒక విషయాన్ని వెల్లడించారు. మొదటి సినిమా భారీ వసూళ్లు సాధించినంత మాత్రాన రెండో భాగాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించాలని అనుకోవడం లేదని అన్నారు. కథ డిమాండ్‌ను బట్టి భారీ స్థాయి అవసరమైతే తప్ప సీక్వెల్‌ను కూడా మొదటి సినిమాకు పెట్టిన బడ్జెట్లోనే తీయాలని భావిస్తున్నాను. రూ. 10 కోట్లు లేదా రూ. 20 కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రాన బాగా వస్తుందని చెప్పలేం. అవసరం లేకపోయినా అనవసరంగా VFX లూదా AIని వినియోగిస్తే సినిమా సహజత్వం దెబ్బతినే అవకాశం ఉంటుంది అని వెల్లడించారు.
వాస్తవికతకే ప్రాధాన్యం
బడ్జెట్ పెంచడం కంటే వాస్తవికతను కాపాడుకోవడమే చాలా ముఖ్యం అని అన్నారు. సినిమాకు సంబంధించి పాత్రలే కాదు, కథకు సంబంధించిన కాలం నాటి భౌగోళిక పరిస్థితులు, వాతావరణం (Atmosphere) చూపించడం కూడా ముఖ్యం. అందుకే వాస్తవికతకే ప్రాధాన్యం ఇస్తాం అని చెప్పారు. మొదటి భాగానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలతో బడ్జెట్‌ను వినియోగిస్తాం అని తెలిపారు. తక్కువ బడ్జెట్లో తీసిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. కాబట్టి డబ్బులను వృథా చేయదలచుకోలేదు. ఒకవేళ రెండో భాగానికి భారీ బడ్జెట్ అవసరమైతే పెంచుతాం అని పేర్కొన్నారు. అయితే మా సినిమా దర్శకుడు వేరే సినిమా ఒప్పుకోవడంతో హనుమాన్ అంశ్ 2కు సమయం పడుతుందని వెల్లడించారు.
హనుమాన్ అంశ్ ఆగస్టు 7న రిలీజయ్యింది. ఈ సినిమాకు రూ. 1.5 కోట్లకు పైగా ఖర్చయింది. కానీ రూ. 2 కోట్లు కాదు అని అనుప్రియా స్పష్టం చేశారు. ఇంత చిన్న బడ్జెట్ సినిమా ఇప్పటివరకు రూ. 312 కోట్లకు పైగా వసూలు చేసింది. కరెన్సీ కాదు కంటెంట్ ముఖ్యం అని ఈ సినిమా నిరూపించింది.