Nagarjuna | మళ్లీ థియేటర్లలో ‘గీతాంజలి’.. నాగార్జున కల్ట్ క్లాసిక్ రీ-రిలీజ్ డేట్ ఇదే!
Nagarjuna | భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రేమకథా చిత్రాల్లో ‘గీతాంజలి’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రేమ, అనుబంధం, భావోద్వేగాలను ఎంతో సున్నితంగా తెరపై ఆవిష్కరించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించారు. అప్పట్లో ఘన విజయం సాధించిన ‘గీతాంజలి’.. కాలం మారినా తన ప్రత్యేకతను మాత్రం కోల్పోలేదు.
Nagarjuna | భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రేమకథా చిత్రాల్లో ‘గీతాంజలి’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రేమ, అనుబంధం, భావోద్వేగాలను ఎంతో సున్నితంగా తెరపై ఆవిష్కరించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించారు. అప్పట్లో ఘన విజయం సాధించిన ‘గీతాంజలి’.. కాలం మారినా తన ప్రత్యేకతను మాత్రం కోల్పోలేదు. సినిమా విడుదలై దశాబ్దాలు గడిచిపోయినా.. ఇందులోని ప్రేమకథ, పాత్రలు, సంగీతం, భావోద్వేగ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అందుకే ఈ సినిమాను అభిమానులు ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్‌గా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఈ మధురమైన ప్రేమకావ్యం మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
నాగార్జున నటించిన ‘గీతాంజలి’ చిత్రాన్ని నవంబర్ 13న థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. కల్ట్ క్లాసిక్ అందించిన మ్యాజిక్‌ను మరోసారి థియేటర్లలో అనుభూతి చెందాలంటూ చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ ప్రకటనతో నాగార్జున అభిమానుల్లోనూ, పాత సినిమాలను థియేటర్లలో మళ్లీ చూడాలనుకునే సినీ ప్రియుల్లోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ‘గీతాంజలి’ వంటి ప్రేమకథను పెద్ద తెరపై మరోసారి చూసే అవకాశం రావడంతో అభిమానులు ఈ రీ-రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
నిజానికి నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న కాకుండా ఆగస్టు 28నే ‘గీతాంజలి’ని ప్రత్యేకంగా రీ-రిలీజ్ చేయాలని ముందుగా మేకర్స్ ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా అప్పట్లో వెలువడింది. అయితే చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల రీ-రిలీజ్ వాయిదా పడింది. తాజాగా మరోసారి విడుదల తేదీని ఖరారు చేసిన చిత్రబృందం.. నవంబర్ 13న ‘గీతాంజలి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. నాగార్జున కెరీర్లో ‘గీతాంజలి’ ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది. మణిరత్నం దర్శకత్వ ప్రతిభ, నాగార్జున నటన, ప్రేమకథలోని భావోద్వేగాలు, సంగీతం.. ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి అంశం ప్రేక్షకులపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపించింది. ఇప్పుడు ఈ క్లాసిక్ మరోసారి థియేటర్లలోకి రావడంతో అప్పట్లో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులతో పాటు కొత్త తరం సినీ అభిమానులు కూడా ‘గీతాంజలి’ని పెద్ద తెరపై ఆస్వాదించే అవకాశం దక్కనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

