Suryakumar Yadav : ఆసియా కప్‌లో భారత జట్టు అజేయంగా ఫైనల్ ఆడబోతోంది. లీగ్ దశ, సూపర్ -4దశలో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా మరోసారి దాయాదిని నిలువరించేందుకు సిద్ధమవుతోంది. బ్యాటింగ్ విభాగం అదరగొడుతున్నా.. బౌలింగ్, ఫీల్డింగ్ మరీ దారుణంగా ఉండడమే అందరినీ కలవరపరుస్తోంది. మరీ ముఖ్యంగా టీ20 స్పెషలిస్ట్ అయిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పేలవ ఫామ్ అందరినీ కలవరపరుస్తోంది. మిస్టర్ 360గా పేరొందిన సూర్య.. ఈ టోర్నీలో మాత్రం మూడు మ్యాచుల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఒకప్పుడు పొట్టి ఫార్మాట్లో ఓ వెలుగు వెలిగిన సూర్య ఫైనల్లో మెరవాలని అందరూ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెటరన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) భారత సారథికి విలువైన సలహా ఇచ్చాడు.
హ్యాండ్ షేక్ వివాదం ప్రభావం కావొచ్చు సూర్య మునపటిలా తనదైన షాట్లు ఆడలేకపోతున్నాడు. చివరి సూపర్ -4 మ్యాచ్‌లో లంకపై 12 బంతుల్లో 11 రన్స్ మాత్రమే చేశాడు.. మొత్తానికి ఐదు ఇన్నింగ్స్‌ల్లో 23.66 సగటుతో 71 రన్స సాధించాడంతే. టోర్నీ ఆరంభం నుంచి అభిషేక్ ఉతికేస్తున్నా.. ఫైనల్లో అతడు విఫలమైతే కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన బాధ్యత సూర్య మీద పడుతుంది. అందుకే.. అతడికి గవాస్కర్ ఓ సలహా ఇచ్చాడు. ‘సూర్య క్లాస్ ప్లేయర్ అనడంలో ఏ సందేహం లేదు. అతడిని నా సలహా ఏంటంటే.. రాగానే షాట్లకు ప్రయత్నించకుండా నాలుగైదు బంతుల్ని ఆడి చూడాలి.
Sunil Gavaskar’s advice for Suryakumar Yadav before Asia Cup 2025 final#sunilgavaskar #indvspak #indvspakasiacup2025 #indiavspakistanasiacup2025 #asiacup2025 #asiacupcricket pic.twitter.com/aI1Te58VSb
— Sports Today (@SportsTodayofc) September 27, 2025
పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఆపై పిచ్ పేస్‌కు అనుకూలిస్తుందా?, బంతి బౌన్స్ అవుతుందా? బాగా టర్న్ అవుతుందా? అనేవి గమనించి బ్యాట్‌కు పని చెప్పాలి. అందుకే.. సూర్య క్రీజులోకి వచ్చిన వెంటనే తన సహజమైన ఆటకు తెరతీయకుండా.. ఓపికగా ఉండాలి. కాస్త కుదురుకున్నాడంటే అతడు తనదైన స్టయిల్లో విధ్వంసం సృష్టించకుండా ఎవరూ ఆపలేరు’ అని సన్నీ అన్నాడు.
What a brilliant Super Over from Arshdeep Singh 👏
He conceded just 2 runs and picked up the wickets of Kusal Perera and Dasun Shanaka. 🙌#TeamIndia need 3 to win!
Updates ▶️ https://t.co/xmvjWCaN8L#AsiaCup2025 | #Super4 | #INDvSL | @arshdeepsinghh pic.twitter.com/IdJ6drgenC
— BCCI (@BCCI) September 26, 2025
ఫైనల్‌కు ముందు చివరి సూపర్ 4 మ్యాచ్‌తో భారత జట్టులోని ఫీల్డింగ్, బౌలింగ్ ప్రదర్శన లోపాలు తెలిసొచ్చాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ(61), తిలక్ వర్మ(49 నాటౌట్)ల మెరుపులతో శ్రీలంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. పసలేని బౌలింగ్‌తో మ్యాచ్ చేజార్చుకునే పరిస్థితి ఎదురైంది. ఇదే తీరు ఫైనల్లోనూ కొనసాగితే పాకిస్థాన్ లాభపడే అవకాశముంది. అందుకే.. లంకతో మ్యాచ్ టీమిండియాకు మేల్కొలుపు లాంటిది అంటున్నాడు గవాస్కర్.
‘ఫైనల్‌కు ముందు కఠినమైన మ్యాచ్ ఎదురవ్వడం మంచిదే. తేలికగా గెలవాల్సిన మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లడం.. భారత జట్టు మరింత మెరుగవ్వడానికి దోహదపడుతుంది’ అని సన్నీ వివరించాడు. సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా భారత్, పాక్ మధ్య టైటిల్ పోరు జరుగనుంది. ఆసియా కప్ చరిత్రలో మొట్టమొదటిసారి దాయాదులు ఫైనల్ల్ తలపడుతుడడంతో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.