Gautam Gambhir : టెస్టు సిరీస్ విజయోత్సాహంతో భారత జట్టు పొట్టి సిరీస్‌కు సన్నద్దం అవుతోంది. స్వదేశంలో ఘనమైన రికార్డు కలిగిన టీమిండియా మరో టీ20 సిరీస్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. గ్వాలియర్‌లో అక్టోబర్ 6, ఆదివారం బంగ్లాదేశ్‌తో తొలి టీ20 కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. మరోవైపు.. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) దైవ దర్శనం చేసుకున్నాడు.
టీమిండియా హెడ్‌కోచ్‌గా తన ముద్ర వేసిన గంభీర్ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన మాత పితాంబర దేవాలయా (Mata Pitambara Temple)న్ని సందర్శించాడు. పసుపు రంగు కుర్తా, తెల్లని పంచె ధరించిన గంభీర్ ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. ఆ తర్వాత వాంఖండేశ్వర మహదేవ ఆలయంలో కూడా భారత కోచ్ పూజలు నిర్వహించాడు. ‘అంతా శుభమే కలగాల’ని గంభీర్ ప్రార్థించినట్టు తెలుస్తోంది.
#WATCH | Team India Coach Gautam Gambhir Offers Prayers At Pitambra Shakti Peeth In Datia Ahead Of India Vs Bangladesh T20 Match#MadhyaPradesh #Cricket #INDvBAN pic.twitter.com/IF7FFxXTs7
— Free Press Madhya Pradesh (@FreePressMP) October 4, 2024
ఐపీఎల్ 17వ సీజన్లో మెంటార్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ట్రోఫీ కట్టబెట్టిన గంభీర్ టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వారసుడిగా హెడ్‌కోచ్ పదవి చేపట్టిన గంభీర్ తొలి పర్యటనలోనే ఆకట్టుకున్నాడు. శ్రీలంక పర్యటన (Srilanka Tour)లో భారత్‌ను టీ20 సిరీస్ విజేతగా నిలిపాడు. అయితే.. వన్డే సిరీస్‌లో లంక స్పిన్ ఉచ్చు బిగించి ట్రోఫీ తన్నుకుపోయింది. ఈ ఓటమి బాధతోనే స్వదేశం చేరుకున్న భారత ఆటగాళ్లు.. బంగ్లాదేశ్‌పై అదరగొట్టారు.
Captain @ImRo45 collects the @IDFCFIRSTBank Trophy from BCCI Vice President Mr. @ShuklaRajiv 👏👏#TeamIndia complete a 2⃣-0⃣ series victory in Kanpur 🙌
Scorecard – https://t.co/JBVX2gyyPf#INDvBAN pic.twitter.com/Wrv3iNfVDz
— BCCI (@BCCI) October 1, 2024
చెపాక్, కాన్పూర్‌లో అద్భుత విజయాలతో 2-0తో సిరీస్ టీమిండియా వశమైంది. ఇక్కడ గంభీర్ మార్క్ కోచింగ్ గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. కాన్పూర్‌లో ఆఖరి రెండు రోజుల్లో రోహిత్ సేన చెలరేగిన తీరును అభిమానులు మర్చిపోలేరు. డ్రాగా ముగియాల్సిన టెస్టులో టీమిండియా టీ20 తరహా ఆటతో బంగ్లాదేశ్‌ను వణికించడంలో గంభీర్ వ్యూహం సూపర్ హిట్ అయింది. బంగ్లాపై రెండో టెస్టులో చిరస్మరణీయ విజయంతో భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పట్టికలో అగ్రస్థానం పదిలం చేసుకుంది.