Ram Charan 16 | రామ్ చరణ్ – బుచ్చిబాబు ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లేది అప్పుడే.?
Ram Charan 16 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రానుండగా.. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Ram Charan 16 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రానుండగా.. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనతో ఒక సినిమా చేయబోతున్నాడు.
ఆర్సీ16 వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ చిత్రీకరణ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నవంబర్ 1 నుంచి రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. నవంబర్ 1 నుంచి 8 వరకు రామ్‌చరణ్‌తో పాటు కీలక నటీ నటులపై చిత్రీకరణ చేయబోతున్నారని సమాచారం. కాగా దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది.
మరోవైపు ఈ సినిమా కోసం రామ్ చరణ్ 100 కేజీలకు పైగా బరువు పెరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఆస్కార్-విజేత A.R. రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.
Also read..
- WIW vs SAW | విండీస్ హిట్టర్లకు ముకుతాడు.. సఫారీలను ఊరిస్తున్న లక్ష్యం..?
- KTR | దొడ్డు వడ్లకు కూడా రూ. 500 బోనస్ చెల్లించాలి.. రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ డిమాండ్
- Jaishankar | అక్టోబర్ 15న పాకిస్థాన్‌కు జైశంకర్.. ఎందుకంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

