Gautam Gambhir : స్వదేశంలో మళ్లీ విజయాల బాట పట్టిన భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన జోష్‌తో సఫారీలకు చెక్ పెట్టాలనుకున్న టీమిండియా వ్యూహం బెడిసికొట్టింది. ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో కావాలని మరీ స్పిన్ ట్రాక్ తయారు చేసుకున్న భారత్.. ప్రత్యర్ధి స్పిన్నర్లకు దాసోహమైంది. విజయం ఖాయమనుకున్న వేళ ఊహించని ఓటమి అందర్నీ షాక్‌కు గురి చేసింది. తొలి టెస్టులో ఘోర పరాభవంపై కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) స్పందిస్తూ.. 124 పరుగుల లక్ష్యం ఛేదించదగ్గదే అని అన్నాడు.
కోచ్ పదవి చేపట్టిన నుంచి ప్రయోగాలతో విమర్శల పాలవుతున్న గంభీర్ ఈసారి కూడా భంగపడ్డాడు. మూడో స్థానంలో సాయి సుదర్శన్ బదులు వాషింగ్టన్ సుందర్‌ను ఆడించి తప్పు చేసిన గౌతీనే జట్టు ఓటమికి బాధ్యుడంటూ మండిపడుతున్నారు అభిమానులు. పిచ్ గురించి కూడా విమర్శలు వస్తున్న వేళ మ్యాచ్ అనంతరం గంభీర్ మాట్లాడుతూ.. ‘ఏ పిచ్ మీద అయినా సరే 124 పరుగుల లక్ష్యం ఛేదించదగ్గదే. ఈడెన్ పిచ్ ఏమంత ఆడడానికి సాధ్యంకాని పిచ్ కాదు.
India Head Coach Gautam Gambhir shuts down talk of an Eden Gardens pitch controversy after the match.
📸: JioStar pic.twitter.com/nZrxB5iCYu
— CricTracker (@Cricketracker) November 16, 2025
కానీ, ఆరంభంలోనే వికెట్లు పడడంతో మేము ఒత్తిడికి లోనయ్యాం. పిచ్‌ను తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే క్యురేటర్ సుజన్ ముఖర్జీ మేము అడినట్టే పిచ్ సిద్ధం చేశారు. క్రీజులో ఓపికగా నిలబడి రాహుల్, అక్షర్ పటేల్, సుందర్ బవుమాలు పరుగులు చేశారు కాబట్టి పూర్తిగా స్పిన్ ట్రాక్ అనడానికి లేదు. బలమైన డిఫెన్స్ ఉంటే పరుగులు చేయడం కష్టమేమీ కాదిక్కడ’ అని గంభీర్ వెల్లడించాడు.
ఈడెన్ గార్డెన్స్‌లో తొలి రెండు రోజులు ఆధిపత్యం చెలాయించిన టీమిండియా మూడోరోజు చేతులెత్తేసింది. స్పిన్ పిచ్ మీద దక్షిణాఫ్రికా బ్యాటర్లను హడలెత్తించిన కుల్దీప్.. జడేజాలు జట్టును గెలుపు వాకిట నిలిపారు. కానీ, మన బ్యాటర్లు 124 పరుగుల ఛేదనలో హర్మన్(4-21) ధాటికి క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా 15 ఏళ్లలో భారత గడ్డపై దక్షిణాఫ్రికాకు తొలి టెస్టు విజయం సాధ్యమైంది.
South Africa win the 1st Test by 30 runs.#TeamIndia will look to bounce back in the 2nd Test.
Scorecard ▶️https://t.co/okTBo3qxVH #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/21LHhUG5Rz
— BCCI (@BCCI) November 16, 2025
ఈ ఓటమికి కారణాలను విశ్లేషిస్తే.. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్డ్ కావడం, నలుగురు స్పిన్నర్లతో ఆడడం వంటివి ఇట్టే అర్దమైపోతాయి. మూడో స్థానంలో రాణిస్తున్న సాయి సుదర్శన్‌ను పక్కన పెట్టేయడం.. వరల్డ్ క్లాస్ పేసర్లు బుమ్రా, సిరాజ్ ఉన్నా స్పిన్ పిచ్ కావాలని కోరడం.. అన్నింటికి మించి సఫారీలను తేలికగా తీసుకోవడం కూడా ఒక కారణమే అనిపిస్తోంది.