Gautam Gambhir | అసిస్టెంట్ కోచ్‌లుగా ‘ఆ ఇద్దరూ’.. సంతోషంగా ఉందన్న గంభీర్
Gautam Gambhir : భారత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఎట్టకేలకు ఖుషీ అయ్యాడు. టీమిండియా అసిస్టెంట్ కోచ్‌లుగా ఐపీఎల్ సహచరులను పట్టుపట్టి మరీ నియమించుకున్న ఆనందంలో గౌతీ ఉన్నాడు.
Gautam Gambhir : భారత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఎట్టకేలకు ఖుషీ అయ్యాడు. టీమిండియా అసిస్టెంట్ కోచ్‌లుగా ఐపీఎల్ సహచరులను పట్టుపట్టి మరీ నియమించుకున్న ఆనందంలో గౌతీ ఉన్నాడు. అసిస్టెంట్ కోచ్‌లుగా అభిషేక్ నాయర్ (Abhishek Nair), రియాన్ డస్చేట్(Ryan Doeschate)ల నియమాకానికి భారత క్రికెట్ నియంత్రన మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గంభీర్ ధ్రువీకరించాడు. శ్రీ
లంక పర్యటనకు బయల్దేరడానికి ముందు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)తో కలిసి గంభీర్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్బంగా అభిషేక్, డస్చేట్లు సహాయక కోచ్‌లుగా ఎంపికయ్యారని అతడు తెలిపాడు. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అడిగినవాటిలో చాలావాటికి బీసీసీఐ ఓకే చెప్పింది. అభిషేక్, డస్చేట్లు అసిస్టెంట్ కోచ్‌లుగా ఖరారయ్యారు. ఇది చాలా మంచి టీమ్. మాకు శ్రీలంక సిరీస్ తర్వాత కూడా సమయం ఉంది. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా సమయంలో అభిషేక్, డస్చేట్లను నేను బాగా నిశితంగా గమనించాను.
🚨Gautam Gambhir on Abhishek Nayar and Ryan Ten Doeschate as support staff :
” I have worked closely with Abhishek and Ryan in last two months at IPL with KKR. Both Absolute professionals and hopefully have a successful stint with the Indian team as coaches”. pic.twitter.com/fbP2O6w8uv
— KKR Vibe (@KnightsVibe) July 22, 2024
వీళ్లిద్దరి పనితీరు అద్భుతం. వీళ్ల మీద ఆటగాళ్ల నుంచి కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. టీమిండియా సహాయక కోచ్‌లుగా అభిషేక్, డస్చేట్లు విజయవంతం అవుతారని ఆశిస్తున్నా. లంక సిరీస్ తర్వాత పూర్తి స్థాయి అసిస్టెంట్ కోచ్‌లుగా ఉండేది ఎవరో తేలిపోతుంది’ అని గంభీర్ వివరించాడు. అంతేకాదు ఫిట్నెస్ దృష్ట్యానే హార్దిక్ పాండ్యాను తప్పించి సూర్యకుమార్‌ను టీ20 కెప్టెన్ చేశామని చెప్పాడు.
🆙 Next 👉 Sri Lanka 🇱🇰#TeamIndia are back in action with 3 ODIs and 3 T20Is#INDvSL pic.twitter.com/aRqQqxjjV0
— BCCI (@BCCI) July 18, 2024
సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు లంకతో వన్డేలకు రెస్ట్ ఇచ్చామని అన్నాడు. ఇక స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు 2027 వరల్డ్ కప్ వరకూ ఫిట్‌గా ఉంటారని ఆశిస్తున్నానని గంభీర్ వెల్లడించాడు. శ్రీలంక పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూలై 27న జరిగే టీ20తో సిరీస్ మొదలవ్వనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే స్క్వాడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Economic Survey | ఏటా 78 లక్షల ఉద్యోగాలు కల్పించాల్సిందే.. తేల్చి చెప్పిన ఆర్ధిక సర్వే..!
- Ajit Agarkar | హార్దిక్‌కు ఫిట్నెస్ సమస్య! కెప్టెన్ అంటే అన్ని మ్యాచ్‌లు ఆడాలి.. అగార్కర్ కామెంట్స్
- Special Status | ప్రత్యేక హోదా తక్షణమే ప్రకటించాలి : బిహార్ కాంగ్రెస్ చీఫ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

