Special Status | ప్రత్యేక హోదా తక్షణమే ప్రకటించాలి : బిహార్ కాంగ్రెస్ చీఫ్
Special Status : బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల బిహార్ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ మండిపడ్డారు.
Special Status : బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల బిహార్ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ మండిపడ్డారు. నితీష్ కుమార్ సీఎం అయినప్పటి నుంచీ బిహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన లేవనెత్తుతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా కేటాయించేందుకు నిబంధనలు అనుమతించకుంటే వాటిని సవరించాలని అఖిలేష్ సింగ్ సూచించారు. మీరు అధికారంలో ఉన్నా ప్రజలను ఎందుకు తప్పుదారి పట్టిస్తున్కారని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిహార్‌కు ప్రత్యేక హోదాను కేంద్రం నిరాకరించిన నేపధ్యంలో నితీష్ కుమార్ రాజీనామాకు లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేయడం సరైనదేనని అఖిలేష్ సింగ్ సమర్ధించారు. నితీష్ కుమార్ 2005లో సీఎం అయినప్పటి నుంచి తాము బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను వింటున్నామని గుర్తుచేశారు. ప్రతి సమావేశంలో నితీష్ ఈ డిమాండ్‌ను లేవనెత్తేవారని చెప్పారు.
నితీష్ బిహార్ సీఎం పదవి చేపట్టి 20 ఏండ్లు పూర్తిచేసుకున్నారని, బిహార్ ప్రజలను మోసగించకుండా రాష్ట్రానికి సత్వరమే ప్రత్యేక హోదాను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బిహార్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ స్పందనపై జేడీయూ ఎంపీ దినేష్ చంద్ర ఠాకూర్ స్పందించారు. ప్రత్యేక హోదా డిమాండ్ భవిష్యత్‌లోనూ ముందుకొస్తుందని, బిహార్‌కు పెట్టుబడులు ఎలా వస్తాయి..రాష్ట్రం ఎలా అభివృద్ధి సాధిస్తుందనే విషయాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Read More :
Prabhas Fauji | ఇండో-పాక్ లవ్ స్టోరీ.. ప్రభాస్‌తో రొమాన్స్ చేయనున్న పాకిస్థాన్ బ్యూటీ.?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

