Gautam Gambhir : టీమిండియా కోచ్‌గా తొలి సిరీస్‌లో గౌతం గంభీర్ (Gautam Gambhir) తన మార్క్ చూపించాడు. శ్రీలంక (Srilanka) పర్యటనతో బాధ్యతలు స్వీకరించిన గౌతీ మొదటి పరీక్షలోనే వందకు వంద మార్కులు కొట్టేశాడు. గంభీర్ డైరెక్షన్‌కు కొత్త కెప్టెన్ సూర్యకుయార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రశాంతత తోడవ్వడంతో భారత జట్టు టీ20ల సిరీస్‌లో ఆతిథ్య జట్టును వైట్ వాష్ చేసింది.
ఈ సిరీస్‌లో గంభీర్ ఏ కోచ్ చేయని సాహసం చేశాడు. కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ.. పవర్ హిట్టర్లతో తొలిసారి బౌలింగ్ చేయించాడు. అంతేకాదు ఆశించిన ఫలితాలు రాబట్టి సిరీస్ క్లీన్ స్వీప్ చేయించిన భారత హెడ్‌కోచ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)లు కొల్లగొట్టాలంటే ఆల్‌రౌండర్లు చాలా ముఖ్యం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇదే ఫార్ములాతో హిట్ కొట్టాయి. అందుకని గంభీర్ కూడా టీమిండియాను ఆల్‌రౌండర్ల యూనిట్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అనిపిస్తోంది.
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎!
Congratulations to the @surya_14kumar-led side on clinching the #SLvIND T20I series 3⃣-0⃣ 👏👏
Scorecard ▶️ https://t.co/UYBWDRh1op#TeamIndia pic.twitter.com/h8mzFGpxf3
— BCCI (@BCCI) July 30, 2024
మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) మాదిరిగానే శ్రీలంక పర్యటనతో గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. తొలి టీ20లో భారత జట్టు లంకపై రికార్డు స్కోర్‌తో విజయం సాధించింది. అనంతరం రెండో టీ20లో కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యలు అందర్నీ షాక్‌కు గురి చేస్తూ రియాన్ పరాగ్(Riyan Parag)తో బౌలింగ్ చేయించారు. స్పిన్‌కు అనుకూలించే లంక పిచ్‌పై పరాగ్ గూగ్లీ, క్యారమ్ బంతులతో మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
Rinku Singh 🤝 Suryakumar Yadav
The Game-Changing Heroes for India in the Last Two Overs 👏#RinkuSingh #SuryakumarYadav #India #SLvsIND #Cricket #T20Is pic.twitter.com/wtD8JqRbMH
— Wisden India (@WisdenIndia) July 30, 2024
ఇక పల్లెకెలె స్టేడియంలో జరిగిన మూడో టీ20లో భారత జట్టు చిరస్మరణీయ విజయం సిరీస్‌కే హైలెట్ అని చెప్పాలి. అవును.. 138 పరుగుల ఛేదనలో లంక ఓపెనర్లు పథుమ్ నిశాంక(26), కుశాల్ మెండిస్(46)ల విధ్వంసంతో మ్యాచ్‌పై ఆశలు లేని పరిస్థితి. ఆ దశలో రియాన్ పరాగ్‌తో పాటు రింకూ సింగ్(Rinku Singh), సూర్యకుమార్ యాదవ్‌లతో బౌలింగ్ మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లింది.
THE STARS OF TEAM INDIA…
– Rinku Singh & Suryakumar Yadav 😀👌👌 #SLvIND#SuryakumarYadav #cricketer pic.twitter.com/Xu8n6stE50
— Ram Kumar Yadav (@RamKuma08923019) July 30, 2024
ఆఖరి రెండు ఓవర్లలో లంక విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. 19వ ఓవర్లో రింకూ రెండు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇక ఆఖరి ఓవర్లో కెప్టెన్ సూర్య స్పిన్ మాయ చేస్తూ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీయగా లంక 2 పరుగులే చేసింది.
Finishing with the bat ❌
Finishing with the ball✅Rinku Singh and Suryakumar Yadav – India’s surprise death bowling options that worked magic!#SLvIND pic.twitter.com/7fZxlS6PbD
— Cricbuzz (@cricbuzz) July 31, 2024
టీమిండియా విజయానికి మూడు పరుగుల అవసరమవ్వగా… థీక్షణ బౌలింగ్‌లో సూర్య బౌండరీతో జట్టును గెలిపించాడు. ఇరుజట్ల మధ్య ఆగస్టు 2వ తేదిన తొలి వన్డే జరుగనుంది. 50 ఓవర్ల సిరీస్‌లోనూ టీమిండియా, గంభీర్‌లు ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీలు సైతం బౌలింగ్ చేస్తారేమో.?