ఇటీవల సిడ్నీ బాండీ బీచ్‌లో ఆగంతకుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 15 మందికి అభిమానులు సంతాపం ప్రకటించారు. బాండీ బీచ్ ఉదంతంలో గాయాలపాలైనవారితో పాటు కాల్పులకు పాల్పడ్డ వారిని నిలువరించిన అహ్మద్ అల్ అహ్మద్‌ను ఫ్యాన్స్ చప్పట్లతో అభినందించారు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు కాల్పుల బాధితులకు నివాళి అర్పించడంతో పాటు కమ్యూనిటీ మెంబర్స్, ఫస్ట్ రెస్సాండర్స్కు గార్డ్ ఆఫ్ హానర్‌తో పాటు అభిమానులందరూ లేచి నిలబడి గౌరవం చాటుకున్నారు. ఉగ్రదాడిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.