అమిత్ ముందంజ.. నేషనల్ బాక్సింగ్ టోర్నీ
జాతీయ బాక్సింగ్ టోర్నీలో సీనియర్ బాక్సర్ అమిత్ పంగల్, సాగర్ ముందంజ వేశారు. ఆదివారం మొదలైన టోర్నీలో పురుషుల బాటమ్వెయిట్(50కి-55కి) తొలి రౌండ్లో ఎస్‌ఎస్‌సీబీ తరఫున బరిలోకి దిగిన అమిత్..ఉస్మాన్ మహమ్మద్ సుల్తాన్(బీహార్)పై ఏకపక్ష విజయం సాధించాడు.
గ్రేటర్ నోయిడా: జాతీయ బాక్సింగ్ టోర్నీలో సీనియర్ బాక్సర్ అమిత్ పంగల్, సాగర్ ముందంజ వేశారు. ఆదివారం మొదలైన టోర్నీలో పురుషుల బాటమ్వెయిట్(50కి-55కి) తొలి రౌండ్లో ఎస్‌ఎస్‌సీబీ తరఫున బరిలోకి దిగిన అమిత్..ఉస్మాన్ మహమ్మద్ సుల్తాన్(బీహార్)పై ఏకపక్ష విజయం సాధించాడు. తన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ అమిత్ ఆది నుంచే ప్రత్యర్థిపై పంచ్‌లు కురిపించాడు. మరో బౌట్లో సాగర్..ఎడ్విన్(కేరళ)పై చెమటోడ్చి గెలువగా, లాల్రామ్బౌత్..సంతోష్‌కుమార్(ఒడిశా)ను ఓడించి తదుపరి రౌండ్లోకి ప్రవేశించారు.
ఇదిలా ఉంటే టోర్నీలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో సీనియర్ బాక్సర్లు ఏకంగా నాలుగు గంటల పాటు బౌట్ల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. రవాణాలో ఏర్పడిన సమస్య కారణంగా మొత్తం మూడు రింగులకు గాను సాయంత్రం 4 గంటల వరకు ఒకే రింగ్ తయారు కావడంతో ఆదివారం జరుగాల్సిన బౌట్లు సోమవారానికి వాయిదాపడ్డాయి. తొలిసారి జాతీయ పురుషుల, మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ జరుగుతున్న వేళ..ఏర్పాట్లపై నిర్వాహకులు దృష్టి సారించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

