జాంబీ ఫిల్మ్‌తో బాలీవుడ్ ఎంట్రీ
సూపర్‌హీరో కథాంశంతో రూపొందిన ‘లోక ఛాప్టర్-1’ (తెలుగులో ‘కొత్తలోక’) చిత్రంతో కెరీర్లోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది కథానాయిక కల్యాణి ప్రియదర్శన్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా 300కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
సూపర్‌హీరో కథాంశంతో రూపొందిన ‘లోక ఛాప్టర్-1’ (తెలుగులో ‘కొత్తలోక’) చిత్రంతో కెరీర్లోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది కథానాయిక కల్యాణి ప్రియదర్శన్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా 300కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. గత ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ‘లోక ఛాప్టర్-1’ అపూర్వ విజయంతో కల్యాణి ప్రియదర్శన్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెతో సినిమాలు తీసేందుకు ఆసక్తిగా ఉన్నారు. తాజాగా ఈ సొగసరి బాలీవుడ్లో భారీ ఆఫర్‌ను దక్కించుకుంది.
జాంబీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా జై మెహతా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మరో విశేషమేమిటంటే.. బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్‌సింగ్ ఈ సినిమా ద్వారా ఫిల్మ్ ప్రొడక్షన్లోకి ప్రవేశిస్తున్నారు. ‘మా కసమ్’ బ్యానర్‌పై ఆయన తెరకెక్కించనున్న తొలి సినిమా ఇది. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందని, ‘లోక ఛాప్టర్-1’లో కల్యాణి ప్రియదర్శన్ పర్ఫార్మెన్స్ రణ్‌వీర్‌సింగ్‌ను ఎంతగానో ఆకట్టుకుందని, అందుకే పలువురు బాలీవుడ్ అగ్ర నాయికల్ని కాదని కల్యాణి ప్రియదర్శన్‌కు అవకాశమిచ్చారని ముంబై సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ప్రస్తుతం కల్యాణి ప్రియదర్శన్ తమిళంలో ‘జీని’ ‘మార్షల్’ చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

