BCCI : భారత మాజీ ఆటగాళ్లు సౌరభ్ గంగూలీ(Sourav Ganguly), హర్భజన్ సింగ్(Harbhajan Singh)లు బీసీసీఐ పూర్తికాల సభ్యుల ప్రతినిధులుగా ఎంపికయ్యారు. వార్షిక సమావేశం(AGM), కార్యవర్గం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ దిగ్గజ ఆటగాళ్లకీ గౌరవం లభించింది. సెక్రటరీ దేవజిత్ సైకియా, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ కూడా ప్రతినిధులుగా వ్యవహరిస్తారని శనివారం బీసీసీఐ ఎన్నికల అధికారి ఏకే జోటీ తెలిపాడు. బెంగాల్ క్రికెట్ సంఘానికి దాదా .. పంజాబ్ క్రికెట్ సంఘానికి భజ్జీ ప్రతినిధులుగా భారత బోర్డు వార్షిక సమావేశానికి హాజరు కానున్నారు.
సెప్టెంబర్ 28న బీసీసీఐ వార్షిక సమావేశం జరుగనుంది. అదే రోజు అధ్యకుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి కోసం ఎన్నికలు జరుగున్నాయి. ఈ సమావేశంలో బీసీసీఐ పూర్తికాల సభ్యుల ప్రతినిధులుగా గంగూలీ, హర్భజన్ వ్యవహరిస్తారు. సైకియా అస్సాం క్రికెట్ సంఘానికి, అరుణ్ ధుమాల్ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి, కార్యదర్శి ప్రభ్జిత్ సింగ్ భాటియా ఛత్తీస్గఢ్ క్రికెట్ సంఘం, బోర్డు జాయింట్ సెక్రటరీ రోహన్ గాన్స్ దేశాశ్ గోవా క్రికెట్ ప్రతినిధులుగా ఎంపికయ్యారని ఎన్నికల అధికారి ఏకే జోటి వెల్లడించాడు.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Harbhajan Singh has reportedly been nominated by the Punjab Cricket Association as their representative, putting him in contention to become one of BCCI’s office-bearers. 🙌🏼#Cricket #HarbhajanSingh #BCCI #Sportskeeda pic.twitter.com/yFu7c8o9BO
— Sportskeeda (@Sportskeeda) September 12, 2025
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. స్టేట్ క్రికెట్ సంఘాలు సెప్టెంబర్ 12 రాత్రి 8 గంటల లోపు తమ ప్రతినిధులను నామినేట్ చేయాలి. ఏవైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 14, సెప్టెంబర్ 15 తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావాలి. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను సెప్టెంబర్ 19 వెల్లడించనుంది. సెప్టెంబర్ 28న కొత్త కార్యవర్గం కోసం ఎన్నికలు జరుగుతాయి.