MS Dhoni | టీమ్ ఇండియా (Team India) మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ ఎక్కడికి వెళ్లినా సానుకూల దృక్పథంతో కనిపిస్తుంటాడు. తాజాగా ధోనీ.. వినాయక చవితి (Ganesh Chaturthi) వేడుకల్లో పాల్గొన్నాడు. ఎంతో ఉత్సాహంగా బొజ్జ గణపతిపై పూలు వేసి దర్శించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
42ఏళ్ల ఈ మిస్టర్ కూల్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ లీగ్ తప్ప మిగతా ఏడాదంతా ధోనీ క్రికెట్‌కు దూరంగానే ఉంటున్నాడు. అయినప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ధోనీకి కార్లు, బైక్స్ అంటే మహా పిచ్చి. సమయం దొరికనప్పుడల్లా రాంచీ వీధుల్లో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా రైడ్‌కు వెళ్తుంటాడు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. వాటిని చూసి అభిమానులు తెగ మురిసిపోతుంటారు.
MS Dhoni celebrating Ganesh Chaturthi.
Video of the day….!!!! pic.twitter.com/uWZyAsdsCP
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 21, 2023
Also Read..
Emergency Alert | మీ మొబైల్స్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా..? ఆందోళన చెందకండి, ఎందుకంటే..?
Donald Trump | మా నాన్న డొనాల్డ్ ట్రంప్ చనిపోయారు.. జూనియర్ ట్రంప్ ట్వీట్ వైరల్
Women’s Reservation Bill | రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు