Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు, 2024 అధ్యక్ష రేసులో మొదటి స్థానంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చనిపోయారన్న వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ మేరకు ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ (Donald Trump Jr) అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్రంప్ మరణ వార్తకు సంబంధించిన పోస్టు దర్శనం ఇచ్చింది.
‘ఈ వార్త తెలియజేసేందుకు చింతిస్తున్నాను. మా నాన్న డొనాల్డ్ ట్రంప్ మరణించారు. 2024 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష స్థానానికి నేను పోటీ చేస్తాను’ అంటూ జూనియర్ ట్రంప్ అధికారి ట్విట్టర్ ఖాతాలో పోస్టు దర్శనమిచ్చింది. క్షణాల్లో ఈ పోస్టు వైరల్ అయ్యింది. అయితే, జూనియర్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు తర్వాత తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన టెక్నికల్ టీమ్ జూనియర్ ట్రంప్ ఖాతాను తిరిగి పునరుద్ధరించారు. అందులో హ్యాకర్లు చేసిన పోస్టులను తొలగించారు.
Donal Trump
Also Read..
Joe Biden | గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బైడెన్ను ఆహ్వానించిన భారత్
KTR | నా సీటు వదులుకోవడానికీ సిద్ధం.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
NEET PG 2023 | నీట్ పీజీ విద్యార్థులకు గుడ్న్యూస్.. సున్నా మార్కులొచ్చినా సీటు పొందొచ్చు!