IND vs BAN : టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు స్వదేంలో తొలి సిరీస్ ఆడబోతోంది. శ్రీలంక పర్యటనలో స్పిన్ ఆడలేక తంటాలు పడిన భారత క్రికెటర్లు బంగ్లాదేశ్‌పై దంచికొట్టేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో గురువారం తొలి టెస్టు మొదలవ్వనుంది. దీంతో, తుది జట్టులో ఉండేది ఎవరు? అనే ప్రశ్నకు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) తెరదించాడు.
ఇంగ్లండ్ సిరీస్‌లో ఆపద్భాందువులుగా నిలిచిన అరంగేట్రం హీరోలు సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan), ధ్రువ్ జురెల్(Dhruv Jurel)లు బెంచ్ మీదనే ఉంటారని గౌతీ చెప్పాడు. ‘మేము ఎవ్వరిపై వేటు వేయడం లేదు. అయితే.. తుది జట్టులో అవసరమైన వాళ్లనే తీసుకుంటున్నాం. రిషభ్ పంత్ గైర్హాజరీలో ధ్రువ్ జురెల్ అద్భుతంగా రాణించాడు. కానీ, కొన్నిసార్లు ఆటగాళ్లు వేచి చూడక తప్పదు. సర్ఫరాజ్ ఖాన్ పరిస్థితి కూడా అంతే. వీళ్లకు భవిష్యత్‌లో కచ్చితంగా అవకాశాలు ఇస్తాం. కాకపోతే కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది’ అని గంభీర్ వెల్లడించాడు.
భారత తుది జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, బుమ్రా.
🗣️🗣️ Every game becomes important because of what is at stake.#TeamIndia Captain @ImRo45 ahead of the #INDvBAN Test series opener 👌👌@IDFCFIRSTBank pic.twitter.com/TkcGCDZuYT
— BCCI (@BCCI) September 17, 2024
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో మూడోసారి ఫైనల్ రేసులో ముందున్న భారత జట్టు బంగ్లాదేశ్ సిరీస్‌ను సీరియస్‌గా తీసుకుంటోంది. అందుకనే జట్టు కూర్పులో యాజమాన్యం కుర్రాళ్ల కంటే అనుభవజ్ఞులకే పెద్ద పీట వేస్తోంది. కేఎల్ రాహుల్ (KL Rahul), రిషభ్ పంత్(Rishabh Pant)లు రీ ఎంట్రీ ఇవ్వడంతో సర్ఫరాజ్, జురెల్‌లకు తుది జట్టులో స్థానం దక్కడం అనుమానమే అని అంతా అనుకున్నారు.
బంగ్లా సిరీస్ కోసం నెట్స్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) సెప్టెంబర్ 17మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిభగల కుర్రాళ్లతో భారత బెంజ్ బలంగా ఉందని చెప్పాడు. రాహుల్, పంత్‌లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్‌లు నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సెప్టెంబర్ 19న తొలి టెస్టు జరుగనుంది.