Stock Market Close | దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. కీలమైన వడ్డీ రేట్లను తగ్గించనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించడంతో ఉదయం మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల ప్రభావంతో సూచీలు ఉదయం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆ తర్వాత పెట్టబడులు పెరిగాయి. దీంతో మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఈ క్రమంలో మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారిగా 83,326.38 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. ఈ స్థాయికి సెన్సెక్స్ చేరడం ఇదే తొలిసారి. ఆ తర్వాత ఐటీ, ఎనర్జీ రంగాల్లో స్టాక్స్ అమ్మకాలతో మార్కెట్లు ఒక్కసారిగా ఒత్తిడికి గురైన నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ ఉదయం 83,037.13 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
ఇంట్రాడేలో 82,700.63 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 131.43 పాయింట్ల నష్టంతో 82,948.23 వద్ద ముగిసింది. 41 పాయింట్ల నష్టంతో 25,377.55 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 25,482.20 పాయింట్ల రికార్డు స్థాయి హైకి చేరింది. ట్రేడింగ్‌లో 1,453 షేర్లు పెరగ్గా.. మరో 2,343 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీ అత్యధికంగా నష్టపోయిన వాటిలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా లాభపడ్డాయి. బ్యాంక్ మినహా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3 శాతానికిపైగా నష్టపోవడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆటో, ఫార్మా, మెటల్, ఆయిల్, గ్యాస్ 0.5 నుంచి ఒకశాతం వరకు తగ్గాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం తగ్గాయి.