కొలంబో: శుక్రవారం నుంచి దంబుల్లా వేదికగా జరగాల్సి ఉన్న ఉమెన్స్ ఆసియా కప్‌లో మ్యాచ్‌లను వీక్షించేందుకు గాను మహిళలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) మంగళవారం ఎక్స్ (ట్విటర్)లో ఒక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
మొత్తం 8 జట్లు పాల్గొనబోయే ఈ టోర్నీలో 15 మ్యాచ్‌లు ఆడనుండగా భారత్.. శుక్రవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడబోయే మ్యాచ్‌తో టైటిల్ వేటను ఆరంభించనుంది.