Harbhajan Singh | హైదరాబాద్: టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై అతడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్ భారీగా పరుగులు సమర్పించుకున్న నేపథ్యంలో హిందీ కామెంట్రీ చెబుతున్న భజ్జీ..
‘లండన్‌లో నలుపు రంగు క్యాబ్స్ మీటర్ల మాదిరిగానే ఇక్కడ (మ్యాచ్‌లో) ఆర్చర్ మీటర్ సైతం పెరుగుతూనే ఉంది’ అని వ్యాఖ్యానించాడు. దీంతో సోషల్ మీడియాలో భజ్జీపై విమర్శలు వెల్లువెత్తాయి. అతడి వ్యాఖ్యలు జాత్యాహంకారం కిందకే వస్తాయని ఆరోపిస్తూ..కామెంట్రీ నుంచి తప్పించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.