బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 08, 2020 , 16:22:40

మాజీ క్రికెటర్‌ సోదరుడి దారుణ హత్య

మాజీ క్రికెటర్‌ సోదరుడి దారుణ హత్య

కేప్‌టౌన్:  సౌతాఫ్రికా మాజీ పేసర్‌ వెర్నాన్‌ ఫిలాండర్‌ తమ్ముడు టైరోన్‌ ఫిలాండర్‌ హత్యకు గురయ్యాడు.   టైరోన్‌ను కాల్చిన చంపిన ఘటన  అతడి  సొంతూరు కేప్‌టౌన్‌లోని  రావెన్స్‌మెడ్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగింది.    తన సోదరుడిని కాల్చి చంపిన  ఈ విషయాన్ని మాజీ క్రికెటర్‌ ట్విటర్లో వెల్లడించాడు. 'టైరోన్‌ దారుణ హత్య మా హోమ్‌ టౌన్‌లో జరిగింది.  ఈ క్లిష్ట సమయంలో కుటుంబం గోప్యతను గౌరవించాలని నేను కోరుతున్నాను'. అని ట్వీట్‌ చేశాడు. 

'మర్డర్‌ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు స్వేచ్ఛగా విచారణ జరిపేలా మీడియా సహకరించాలని కోరుతున్నాను. ప్రస్తుతం  హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. టైరోన్‌ ఎప్పటికీ మా మనసులోనే ఉంటాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని వెర్నాన్‌ పేర్కొన్నాడు.   స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం  పక్కింటికి  ట్రాలీలో వాటర్‌ డెలివరీ చేయడానికి  ఇంటి నుంచి బయటకు వెళ్తున్న   సమయంలో కాల్చివేత సంఘటన జరిగిందని చెప్పారు.