AIFF : భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు కొత్త కోచ్ ఎవరనేది త్వరలోనే తేలిపోనుంది. హెడ్‌కోచ్ మనొలో మర్కెజ్పై వేటు అనంతరం ఏర్పడిన అనిశ్చితికి ఆగస్టు 1న తెరదించనుంది ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF). ఇప్పటికే ముగ్గురిని షార్ట్ లిస్ట చేసిన ఏఐఎఫ్ఎఫ్ వీళ్లలో ఒకరి పేరును ఆగస్ట్ 1న వెల్లడించనుంది. అయితే.. జాబితాలోని త్రయంలో మాజీ ఆటగాడైన ఖలీద్ జమిల్ (Khalid Jamil) కోచ్ పదవి రేసులో అందరికంటే ముందున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
‘ఆగస్టు 1న ఎగ్జి్క్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. బ్లూ టైగర్స్‌కు తదుపరి కోచ్ ఎవరు? అనే అంశనే ప్రధాన ఎజెండాగా ఈ మీటింగ్ జరుగనుంది. ఇప్పటికే ఆశావహులు తమ వివరాలను పంపించారు. వీళ్లలో ముగ్గురిని తుది జాబితాకు ఎంపిక చేశాం. అదే రోజున కొత్త కోచ్ పేరును వెల్లడిస్తాం’ అని ఏఐఎఫ్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. షార్ట్ లిస్ట్‌లోని స్టెఫాన్ టర్కోవిక్, మాజీ కోచ్ స్టీఫెన్ కాన్సాంటినే నుంచి జమిల్‌కు పోటీ ఎదురయ్యే అవకాశముంది.
Khalid Jamil, Stephen Constantine, and Stefan Tarkovic —
The 3 names recommended by the AIFF’s Technical Committee as options for the next head coach of the Indian senior men’s national football team
🔍 Who are the three coaches?
🔍 What are their strengths?
🔍 What can Indian… pic.twitter.com/mWR8HvKIpc— ESPN India (@ESPNIndia) July 24, 2025
మిడ్‌ఫీల్డర్ అయిన జమిల్ ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (Indian Super League)లో జంషెడ్పూర్ ఫుట్‌బాల్ క్లబ్‌కు కోచ్‌గా సేవలందిస్తున్నాడు. అతడు వరుసగా రెండు పర్యాయాలు 2023-24లో, 2024-25లో ‘ఏఐఎఫ్ఎఫ్ కోచ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు అందుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టును మునపటిలా తీర్చిదిద్దగల సమర్ధుడు జమాల్ అని ఏఐఎఫ్ఎఫ్ అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ భారత జట్టుకు కోచింగ్ బాధ్యతలు అప్పగిస్తే జమాల్ తక్షణమే విధుల్లో చేరనున్నాడు. వచ్చే సెప్టెంబర్‌లో భారత జట్టు ఫిఫా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 9, 14న సింగపూర్‌తో స్వదేశంలో ఏఎఫ్సీ ఆసియా కప్ క్వాలిఫయింగ్ రౌండ్లో తలపడనుంది.