Piloo Reporter : భారత మాజీ అంపైర్ పీలూ రిపోర్టర్(Piloo Reporter) కన్నుమూశాడు. తటస్థ వేదికల అంపైర్(Neutral Venue Umpire)గా గుర్తింపు పొందిన ఆయన 84 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు. పీలూ కొంత కాలంగా సెరెబ్రల్ కంటూషన్స్ (cerebral contusions) అనే మెదడు సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు. చాలా రోజుల క్రితం మంచం పట్టిన అతను ఈ రోజు ముంబైలోని నివాసంలో మరణించాడు. అతడి మృతి పట్ల పలువురు మాజీ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. ‘తటస్థ అంపైర్లలో ఒకడైన పీలూ రిపోర్టర్ మరణ వార్త నన్ను చాలా బాధించింది. అతడు చూపించే బౌండరీ సంకేతాలను మళ్లీ మళ్లీ చూడాలనిపించేది. పీలూ కుటుంబ సభ్యులు, స్నేహితులకు సంతాపం తెలియజేస్తున్నా’ అని మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు.
పీలూ అంపైరింగ్ కెరీర్ 1984లో మొదలైంది. ఆ ఏడాది ఢిల్లీ వేదికగా భారత్, ఇంగ్లండ్ తలపడిన మ్యాచ్‌లో పీలూ అంపైర్‌గా తొలిసారి బాధ్యతలు నిర్వర్తించాడు. అదే సంవత్సరం ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌తో తొలిసారి వన్డేల్లో అంపైరింగ్ చేశాడు. 1986లో భారత్‌కే చెందిన వీకే రామస్వామి(VK Ramaswami)తో కలిసి పీలూ పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు తలపడిన లాహోర్ టెస్టుకు అంపైర్‌గా ఉన్నాడు. దాంతో, అంతర్జాతీయ మ్యాచ్‌లో తటస్థ అంపైర్లుగా వ్యవహరించిన జోడీగా వీళ్లిద్దరూ చరిత్ర సృష్టించారు.
Sad to hear about the passing away of Shri Piloo Reporter, the first among neutral umpires.
His eccentric boundary signals were a delight to watch.
Heartfelt condolences to his family and friends. pic.twitter.com/aISGN3GDiD— VVS Laxman (@VVSLaxman281) September 3, 2023
చివరిసారిగా 1993లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన ముంబై టెస్టులో అతను మైదానంలోకి అడుగుపెట్టాడు. తన 28 ఏళ్ల కెరీర్లో పీలూ 14 టెస్టులు, 22 వన్డేల్లో అంపైర్‌గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యం ఇచ్చిన 1992 వరల్డ్ కప్‌లో పీలూ అంపైర్‌గా మెప్పించాడు. అంతేకాదు 13 ఫస్ట్ క్యాస్ మ్యాచుల్లోనూ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అందులో రెండు మ్యాచ్‌లకు రెఫరీగా కూడా పని చేశాడు.