Asia cup 2023 : తొలి మ్యాచ్‌లో చేతులెత్తేసిన బంగ్లాదేశ్(Bangladesh) బ్యాటర్లు అఫ్గనిస్థాన్‌పై చెలరేగారు. దాంతో, బంగ్లా 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు కొట్టింది. ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్(112 : 119 బంతుల్లో 7 ఫోర్ల, మూడు సిక్స్‌లు), నజ్ముల్ హెసేన్ శాంటో(104 : 105 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో అఫ్గన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. చివర్లో కెప్టెన్ షకిబుల్ హసన్(32) దంచాడు. దాంతో, బంగ్లా భారీ స్కోర్ చేసింది. అఫ్గన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, గుల్బదిన్ నయూబ్ చెరొక వికెట్ తీశారు.
టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు. ఓపెనర్‌గా వచ్చిన మిరాజ్ సారథి నమ్మకాన్ని నిలబెడుతూ సెంచరీతో కదం తొక్కాడు. మిడిలార్డర్ బ్యాటర్ శాంటోతో కలిసి బంగ్లా ఇన్నింగ్స్‌ను పరుగెత్తించాడు. వీళ్లిందరూ అఫ్గన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. దాంతో, కీలకమైన ఈ మ్యాచ్‌లో బంగ్లా 334 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. యువ పేసర్ మథీశ పథిరణ 4 వికెట్లతో విజృంభించంతో లంక అలవోకగా గెలుపొందింది.