ముంబై: టీమ్ఇండియా మాజీ ఆటగాడు, హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ (Anshuman Gaekwad) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. 1983లో ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన గైక్వాడ్.. 1974-87 మధ్య 12 ఏండ్ల సుదీర్ఘ కేరీర్లో 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. మొత్తం 2254 పరుగులు చేశారు. వాటిలో రెండు సెంచరీలు ఉన్నాయి. 1983లో జలంధర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 201 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. కెరీర్లో 205 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు.
టీమ్ఇండియాకు రెండుసార్లు.. 1997 నుంచి 1999 వరకు, 2000లో భారత జట్టుకు కోచ్‌గా సేవలందించారు. ఆయన కోచ్‌గా ఉన్న సమయంలోనే 2000 ఐసీసీ చాపియన్స్ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. 1999లో ఢిల్లీలోని ఫిజ్షా కోట్లా స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే పదికి 10 వికెట్లు పడగొట్టింది ఆయన హయాంలోనే. 1990ల్లో జాతీయ టీమ్ సెలెక్టర్‌గా, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా పనిచేశారు.
అన్షుమన్ గైక్వాడ్ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. క్రికెట్‌కు గైక్వాడ్ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తను మరణించారన్న వార్త బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానూభూతి వ్యక్తం చేశారు. బీసీసీఐ కార్యదర్శి జైషా, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీతోపాటు పలువురు క్రికెటర్లు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
కాగా, గైక్వాడ్ క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఆదుకోవాలని దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ బీసీసీఐకి విన్నవించిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన బీసీసీఐ గైక్వాడ్ చికిత్సకు తక్షణం సాయం కింద రూ.కోటి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. అయితే ఈలోపే ఆయన చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
Shri Anshuman Gaekwad Ji will be remembered for his contribution to cricket. He was a gifted player and an outstanding coach. Pained by his demise. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) July 31, 2024
RIP Anshu bhai .. terrible terrible news pic.twitter.com/cdR7FvJDf4
— Sourav Ganguly (@SGanguly99) July 31, 2024
My deepest condolences to the family and friends of Mr Aunshuman Gaekwad. Heartbreaking for the entire cricket fraternity. May his soul rest in peace🙏
— Jay Shah (@JayShah) July 31, 2024