రామన్నపేట, జనవరి 06 : రామన్నపేట మండల కేంద్రంలోని మౌలాలి చిల్లా దర్గా ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు గంధం ఊరేగింపు ముతావలి, ముజావర్ ఎండీ జానిపాషా ఇంటి నుండి ప్రారంభించి ఊరేగింపుగా తీసుకెళ్లి దర్గాలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గరిక సత్యనారాయణ మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలు మౌలాలి దీవెనలతో ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటె రమేష్, నాయకులు ఎండి జమీరోద్దిన్, వనం చంద్రశేఖర్, జెల్ల వెంకటేశం, ఎండి అక్రం, ఎండి నాసర్, వార్డు సభ్యులు నూర్జహ అన్వర్, హరిబాబు, కొమ్ము శేఖర్, కొమ్ము రామస్వామి, ఎండి అంజద్, గొరిగే శేఖర్, నకిరేకంటి సుదర్శన్, మిర్జా ఇనాయత్బేగ్, ఎండి అన్జర్, అజర్ పాల్గొన్నారు.