బీబీనగర్, జనవరి 6 : గుర్రపు డెక్క ఆకు తొలగింపుతో రైతులకు కాల్వ ద్వారా సాగునీరు అంది ఊరట కలుగుతుందని మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్, మాజీ రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి అన్నారు. బీబీనగర్ మండల పరిధిలోని చిన్నరావులపల్లి గ్రామ శివారులో గ్రామ సర్పంచ్ కొమిరె శ్రీకాంత్ తన సొంత నిధులతో పెద్ద కాల్వకు ఇరువైపులా పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకు, కంప చెట్ల తొలగింపు పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాల్వలో పేరుకుపోయిన గురపుడెక్క ఆకు, చెట్ల వల్ల సాగునీటి సరఫరా తగ్గి పంటలకు నష్టం వాటిల్లుతోందని, కాల్వ శుభ్రత పనులతో నీటి ప్రవాహం సజావుగా మారి రైతులకు మేలు జరుగుతుందన్నారు.
గ్రామాభివృద్ధి, రైతు సంక్షేమమే లక్ష్యంగా పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, పార్టీ సీనియర్ నాయకులు పిట్టల అశోక్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బెజవాడ సతీష్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కైరవకొండ ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ బద్దం శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేష్, అంబెపు హనుమంతు, శివ, సారాజి యాదగిరి, తోకల శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.