Salil Ankola : భారత మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా (Salil Ankola) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి మలా అశోక్ అంకోలా (Mala Ashok Ankola) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పుణేలోని సలీల్‌కు చెందిన ఇంటిలో ఆమె విగతజీవిగా కనిపించింది. తల్లి మరణవార్తను సలీల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. అమ్మా నీకు సెలవు అనే క్యాప్షన్.. ఆ పక్కనే గుండె పగిలిన ఎమోజీతో ఓ పోస్ట్ పెట్టాడు. అయితే.. ఆమె హత్యకు కారణం ఎవరు? అనేది విషయమై మాత్రం సలీల్ కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
అసలేం జరిగిందంటే..? సలీల్‌కు పుణేలో ఓ ఫ్లాట్ ఉంది. అక్కడ అతడి తల్లి మలా అశోక్ అంకోలా ఉంటోంది. అయితే.. రెండు మూడు రోజులుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దాంతో, అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో.. అక్కడికి వచ్చిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్టు గుర్తించారు. ఆమె మెడ చుట్టూ ఇక ఇనుప కవచంలాంటిది చుట్టి ఉందని పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తులు మలా అశోక్‌ను అత్యంత కిరాతంగా చంపినట్టు నిర్ధారణకు వచ్చారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇక మాజీ ఆటగాడైన సలీల్ 1997లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం భారత క్రికెట్ నియంత్రణ మండలికి సెలెక్టర్‌గానూ అతడు కొన్నాళ్లు సేవలందించాడు. ఈ ఏడాది ఆరంభంలో అంకోల స్థానంలో కొత్త సెలెక్టర్‌గా అజయ్ రాత్రా(Ajay Ratra) ఎంపికయ్యాడు.