అమరావతి : నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam Temple ) మల్లికార్జునస్వామి చెంత గోవులకు గ్రాసాన్ని సమర్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు(EO PEddiraju) తెలిపారు. హేమారెడ్డి మల్లమ్మ మందిరం ఎదురుగా గోకులంలో సుమారు 40 అడుగుల విస్తీర్ణంలో దాతల సహకారంతో నూతనంగా గ్రాసం కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
భక్తులు కూర్చునేందుకు వీలుగా గోకుంలోనూ, గోకుల పరిసర ప్రాంతంలోని పచ్చిక బయలు ప్రదేశంలో బెంచీలను(Benches) ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మల్లమ్మ మందిరం ముందుభాగంలో మరిన్ని దేవతా వృక్షాలను నాటాలని సూచించారు. మల్లమ్మ మందిరం మెట్ల మార్గాన షెడ్లను, ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట ఆలయ అధికారులు నరసింహరెడ్డి, చంద్రశేఖర శాస్త్రి, తదితరులున్నారు.