సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇవాళ రిజర్వ్ డే ఆట ప్రారంభమైంది. అయితే మ్యాచ్ భవితవ్యాన్ని తేల్చేందుకు మొదటి పది ఓవర్లు కీలకమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. తన ట్విట్టర్లో రియాక్ట్ అయిన సచిన్.. తొలి సెషన్ ఆధారంగా మ్యాచ్ ఎటు వెళ్తుందో నిర్ణయించవచ్చు అన్నాడు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇండియా తన ప్లానింగ్‌ను మార్చాలని, ప్రస్తుతం మ్యాచ్‌లో రన్ రేటు కేవలం 2.3గా ఉందని, విభిన్నమైన వ్యూహాలను అనుసరిస్తేనే ఏదైనా ఫలితం ఉంటుందని సచిన్ పేర్కొన్నాడు. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా రెండు వికెట్లకు 70 రన్స్ చేసింది. కోహ్లీ 13, పుజారా 13 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
First 10 overs today will be critical & the 1st session will decide in which direction the match will head.
— Sachin Tendulkar (@sachin_rt) June 23, 2021
India will have to plan the day backwards & with the match run-rate hovering around 2.3 rpo, we will see some different use of tactics by both sides today.#WTC21 #INDvNZ