Voice Of Reason | పోలీసు గుర్రం ప్రాణం తీసిన కోహ్లీ బర్త్డే సెలబ్రేషన్స్
Voice Of Reason | టీమ్ఇండియా (Team India) మాజీ కెప్టెన్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆదివారం తన 35వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టేడియంలో నిర్వాహకులు పటాసుల మోత (Firecrackers) మోగించారు. ఆ శబ్ధానికి ఒక్కసారిగా షాక్ అయిన పోలీసు శాఖకు చెందిన ‘వాయిస్ ఆఫ్ రీజన్’ (Voice Of Reason) అనే గుర్రం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.
Voice Of Reason | టీమ్ఇండియా (Team India) మాజీ కెప్టెన్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆదివారం తన 35వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక అదేరోజు వన్డే ప్రపంచకప్లో భాగంగా టీమ్ ఇండియా.. సౌతాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్కు ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికైంది. ఈ సందర్భంగా స్టేడియంలో నిర్వాహకులు పటాసుల మోత (Firecrackers) మోగించారు. ఆ శబ్ధానికి ఒక్కసారిగా షాక్ అయిన పోలీసు శాఖకు చెందిన ‘వాయిస్ ఆఫ్ రీజన్’ (Voice Of Reason) అనే గుర్రం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.
సాధారణంగా టీమ్ఇండియా మ్యాచ్ గెలవగానే నిర్వాహకులు అన్ని రకాల అనుమతులతో స్టేడియంలో టపాసులు పేల్చడం తెలిసిందే. ఇక ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో జట్టు గెలవడంతోపాటు ప్రత్యేక సందర్భం ఉండటంతో (కోహ్లీ బర్త్డే) సాధారణం కంటే కాస్త ఎక్కువగానే పటాసులు కాల్చారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఐదు నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 150కిపైగా పటాసులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. దీంతో బారీశబ్ధం రావడంతో స్టేడియానికి 100 మీటర్ల దూరంలో విధుల్లో ఉన్న కోల్కతా మౌంటెడ్ పోలీస్ (Kolkata Mounted Police) శాఖకు చెందిన ‘వాయిస్ ఆఫ్ రీజన్’ అనే గుర్రం గుండెపోటుకు గురైనట్లు తెలిసింది. ఈ గుర్రం వయసు 5 ఏళ్ల 10 నెలలు.
ఈ గుర్రం ఈ ఏడాది ప్రారంభంలో కోల్కతా పోలీసు శాఖలోకి చేరినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి బాణాసంచా శబ్ధం విన్న ఆ గుర్రం ఒక్కసారిగా పరుగులు తీసినట్లు చెప్పారు. ఫుల్ స్పీడ్తో రోడ్డు వెంబడి అతివేగంగా పరిగెత్తిందని తెలిపారు. ఈ క్రమంలో రెండు, మూడు వాహనాలను ఢీ కొట్టి రోడ్డుపై కుప్పకూలినట్లు వెల్లడించారు.
Also Read..
Wipro | ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పిన విప్రో.. వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే
Priyanka Gandhi | ప్రియాంక గాంధీని ఖాళీ బొకేతో ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకులు.. వీడియో వైరల్
Naga Chaitanya | భవిష్యత్తును తలుచుకుంటే భయమేస్తోంది.. రష్మిక మార్ఫింగ్ వీడియోపై నాగచైతన్య
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

