లాహోర్: దాయాది దేశాల మధ్య ఇటీవల కాలంలో నెలకొన్న పరిణామాలతో పాకిస్థాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) తమ ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మలేషియాలో జరుగుతున్న సుల్తాన్ జొహొర్ హాకీ కప్‌లో భాగంగా మంగళవారం (అక్టోబర్ 14న) ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడనున్నాయి.
ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు క్రికెట్లో మాదిరిగానే ‘నో షేక్‌హ్యాండ్’ పాలసీని అవలంభిస్తే అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని.. భావోద్వేగాలను అణుచుకోవాలని పాక్ జూనియర్లకు సూచించినట్టు పీహెచ్ఎఫ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. హాకీ ఆసియా కప్‌నకు పాక్ జట్టును పంపించలేదన్న విషయం విదితమే.