Team India : దిగ్గజాల వీడ్కోలుతో భారత టెస్టు జట్టు సంధి దశను ఎదుర్కొంటోంది. ఇంగ్లండ్ పర్యటనతో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) శకం మొదలైనా.. స్వదేశంలో మళ్లీ తడబాటు ఆందోళన రేకెత్తిస్తోంది. వెస్టిండీస్ క్లీన్‌స్వీప్‌తో గాడిలో పడినట్టే కనిపించిన టీమిండియా ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens)లో అనూహ్య ఓటమి చవిచూసింది. టర్నింగ్ పిచ్, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, మరోవైపు బెడిసికొడుతున్న కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ప్రయోగాలు.. ఇలా మొదటి టెస్టులో పరాజయానికి కారణాలు అనేకం. అన్నింటికంటే ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్ టీమ్‌ను గంభీర్ ప్రయోగశాలగా మార్చడం మాజీ ఆటగాళ్లు, అభిమానులను ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది.
ఒకప్పుడు సొంతగడ్డపై అజేయశక్తిగా ప్రత్యర్ధుల భరతం పట్టిన భారత జట్టు గత ఏడాది పట్టు కోల్పోయింది. న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓటమి టీమిండియాకి పెద్ద షాక్. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే అశ్విన్(Ashwin), రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) వీడ్కోలు పలికారు. టెస్టు సారథిగా ఎంపికైన శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్ పర్యటనలో బ్యాటర్‌గా రెచ్చిపోయాడు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో ప్రయోగాలకు తెరతీసిన గంభీర్.. మూడో స్థానంలో కరుణ్ నాయర్ (Karun Nair), సాయి సుదర్శన్ (Sai Sudarshan)ను ఆడించి చూశాడు. స్వదేశంలో వెస్టిండీస్ సిరీస్‌కు నాయర్‌పై వేటు వేసిన సెలెక్టర్లు సాయికి మరో అవకాశమిచ్చారు. ఈ కుర్రాడు కూడా ఒక అర్ద శతకంతో ఆకట్టుకున్నాడు. కానీ.. అతడిని ఒక్క సిరీస్‌కే పరిమితం చేశారు.
సాయి సుదర్శన్ , కరుణ్ నాయర్

డబ్ల్యూటీసీ ఛాంపియన్ దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌కు అతడిని పక్కనపెట్టేసి వాషింగ్టన్ సుందర్‌కు ఓటేశారు. మూడో స్థానంలో వచ్చిన సుందర్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 29, 31 పరుగులతో నిరాశపరిచాడు. కీలకమైన ఆ స్థానంలో సుదర్శన్‌ను ఆడించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని కోచ్ గౌతీని పలువురు విమర్శించారు. అయితే.. మాజీ కోచ్‌లు రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ సైతం పలువురు క్రికెటర్లను పరీక్షించారని వాదిస్తున్నారు కొందరు. ఈ అంశంపై మాజీ ప్లేయర్, ప్రస్తుతం కామెంటేటర్‌గా రాణిస్తున్న ఆకాశ్ చోప్రా ఏమన్నాడంటే..?
‘టెస్టు జట్టుపై కోచ్ గంభీర్ ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ, అవేవీ పెద్దగా ఫలించడం లేదు. మాజీ కోచ్‌లు రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్‌లు తమ హయాంలో 30 నుంచి 35 మంది ఆటగాళ్లను పరీక్షించారు. చివరకు పటిష్టమైన జట్టును తయారుచేశారు. ఇప్పుడు గౌతీ కూడా అదే చేస్తున్నాడు. కానీ, అతడు కోచ్‌గా వచ్చిన 18 నెలల్లోనే 24 మందిని టెస్టు చేశాడు. శాస్త్రి, ద్రవిడ్‌ల లెక్కన చూస్తే గంభీర్‌కు మరో 11 మందిని టెస్ట్ చేయొచ్చు. సీనియర్ల వీడ్కోలు తర్వాత ఏర్పడిన సంధి దశను దాటే క్రమంలో జట్టులోకి కొందరు వచ్చిపోతుంటారు.
ᴋᴏʟᴋᴀᴛᴀ ᴛᴏ ɢᴜᴡᴀʜᴀᴛɪ ✈️
Travel 🧳 Symphony 🎵 ft. #TeamIndia#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/3aU8t0eNwr
— BCCI (@BCCI) November 20, 2025
ఎందుకంటే.. అశ్విన్, రోహిత్, కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలిక కాదు. అదృష్టవశాత్తూ ఒకటిరెండు మ్యాచ్‌లకే కొందరు దొరుకుతారు. కొన్నిసార్లు మరికొన్ని రోజులు నిరీక్షించకతప్పదు’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య గువాహటిలో నవంబర్ 22న రెండో టెస్టు మొదలవ్వనుంది. వాతావరణ మార్పుల దృష్ట్యా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారభం కానుంది. అంతేకాదు విచిత్రంగా ఈ డే టెస్టులో లంచ్ కంటే ముందే టీ సెషన్ ఉండనుంది.
టెస్టు జట్టుకు నిలకడగా రాణించే ఆటగాళ్లు అవసరం. కానీ, కుర్రాళ్లు దేవ్‌దత్ పడిక్కల్, నితీశ్ రానా, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రానాలు ఒక్క మ్యాచ్‌లో మెరుస్తూ.. ఆ తర్వాత తుస్సుమంటున్నారు. అయితే.. కీలకమైన మూడో స్థానంలో సాయి సుదర్శన్ లేదంటే పడిక్కల్‌కు వరుసగా అవకాశమివ్వాలి. తద్వారా వారు ఆత్మవిశ్వాసంతో మంచి స్కోర్లు చేసే జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. అలానే మ్యాచ్ విన్నర్ అయిన పేసర్ షమీ(Shami)ని సెలెక్టర్లు ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేయడం కూడా జట్టుపై ప్రభావం చూపిస్తోంది. బుమ్రా ఆడనప్పుడు సిరాజ్‌కు తోడుగా షమీ ఉండడం చాలా అవసరం. అందుకే.. ఇకనైనా షమీని తీసుకోవాలని కోచ్ గంభీర్‌కు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సూచించిన విషయం తెలిసిందే.
Ajit Agarkar on Mohammad Shami :
“Our domestic season has just begun,if he stays fit and bowls well, why wouldn’t you want someone like Shami”?
Shami bowls 145 overs & takes 20 wickets in this Ranji season 🤯
Will Shami be selected in the SA ODI squad? pic.twitter.com/rCHV1WpZIS
— VIKAS (@Vikas662005) November 19, 2025