Mushfiqur Rahim | బంగ్లాదేశ్ వెటర్ ప్లేయర్ రహీమ్ చరిత్ర సృష్టించాడు. గురువారం ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ముష్ఫికర్ తన టెస్ట్ కెరీర్లో 13వ సెంచరీ చేశాడు. కెరీర్లో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతూ.. సెంచరీ చేసిన 11వ ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన కొంత మంది దిగ్గజ బ్యాట్స్‌మెన్ సరన స్పెషల్ టెస్ట్ క్లబ్లో చేరాడు. ఇంగ్లండ్‌కు చెందిన కాలిన్ కౌడ్రీ తన 100వ టెస్ట్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 1986లో బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించాడు. పాక్‌కు చెందిన జావెద్ మియాందాద్ 1989లో ఈ క్లబ్లో చేరిన తొలి ఆసియా బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు.
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ రికీ పాంటింగ్ 2006లో దక్షిణాఫ్రికాతో సిడ్నీ టెస్ట్‌లో తన 100వ టెస్ట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డును నెలకొల్పాడు. ఇక డేవిడ్ వార్నర్ 2022 డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన తన వందో టెస్ట్‌లో డుబల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఘనతకెక్కాడు. ఇదిలా ఉండగా.. ఢాకాలో జరిగిన రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు ముష్ఫికర్ రహీమ్‌ను ఈ ఘనత సాధించినందుకు బీసీబీ సత్కరించింది. ఈ సందర్భంగా రెండు జెర్సీలను బహూకరించారు. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టెస్ట్ సహచరులు సంతకం చేసింది కాగా.. రెండోది ప్రస్తుత టెస్ట్ టీమ్ సభ్యులు సంతకాలు చేశారు. ఆ తర్వాత 100వ నెంబర్ ఉన్న క్యాప్‌తో పాటు జ్ఞాపికను అందించింది. 38 సంవత్సరాలు ముష్ఫికర్ రహీమ్ టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలికే ఆలోచన లేదని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ నజ్ముల్ అబేదిన్ స్పష్టం చేశారు.